మార్చి 29న విడుదలవుతోన్న ‘టిల్లు స్క్వేర్’

కల్ట్ హిట్ ‘డీజే టిల్లు’తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ని సిద్ధం చేశాడు. ‘డీజే టిల్లు’కి రెట్టింపు ఎంటర్ టైన్ మెంట్ తో ‘టిల్లు స్క్వేర్’ రాబోతుందని ఇప్పటికే మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇక.. లేటెస్ట్ గా ‘టిల్లు స్క్వేర్’ కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు. మార్చి 29న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ‘డీజే టిల్లు’లో నేహా శెట్టి పోషించిన రాధిక పాత్ర తరహాలో ఈ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ఇప్పటికే ‘టిల్లు స్క్వేర్’ నుంచి రిలీజైన ప్రచార చిత్రాలకు మంచి పేరొచ్చింది. మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయం అవుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Related Posts