Raviteja : వేటాడే పులిలా కనిపిస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’

మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు. వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ యేడాది దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రాజమండ్రిలో లాంచ్ చేశారు.

ఈ పోస్టర్ చూడానే రవితేజ పులిలా కనిపిస్తున్నాడనే చెప్పాలి. నోట్లో దబ్బనం(బస్తాలు కుట్టడానికి వాడతారు)తో రైల్వే కంపార్ట్ మెంట్ లోకిచొచ్చుకు పోవడానికి ప్రయత్నిస్తోన్నట్టుగా ఉందీ లుక్. అతని కళ్లు రౌద్రంతో నిండి ఉన్నాయి. ఆ చూపులు వేటకు సిద్ధమైన పులిలా కనిపిస్తున్నాయి. ఓ రకంగా ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేదానికి ఎగ్జాంపుల్ గా కనిపిస్తోందీ లుక్.


ఇక ఈ లుక్ ను రిలీజ్ చేస్తూ రవితేజ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా వైల్డ్ గానే ఉంది..
నేమ్: టైగర్ నాగేశ్వరరావు
విలేజ్: స్టూవర్ట్ పురం

వెల్కమ్ టు మై జోన్.. ద టైగర్ జోన్..” అంటూ రాసుకొచ్చాడు.


ఇది 1970ల ప్రాంతంలో స్టూవర్ట్ పురం ఊరికి సంబంధించిన నాగేశ్వరరావు అనే దొంగకు సంబంధించిన కథ అని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. అతని కళ్లే కాదు.. పాదాలు కూడా పాదరసంలా ఉంటాయని అప్పట్లో చెప్పుకునేవారు. పోలీస్ లకు అడ్రెస్ చెప్పి మరీ దొంగతనాలు చేసేవాడు. అతను చాలెంజ్ చేస్తే దాన్ని చేజే చేయడం ఆ రోజుల్లో ఏ పోలీస్ కూ సాధ్యమయ్యేది కాదు అంటారు. వందల దొంగతనాలు చేసినా.. తనకోసం దాచుకోకుండా అందరికీ పంచేవాడట. అందుకే అతన్ని ఆ ప్రాంతంలో రాబిన్ హుడ్ తరహాలో చూసేవారు. పోలీస్ ల కళ్లకు కనబడకుండా ప్రతి ఇళ్లూ దాచేది. అలాంటి వ్యక్తి కథతో వస్తోన్న ఈ చిత్రంతో మాస్ మహరాజ్ మరో బ్లాక్ బస్టర్ కొట్టేలానే ఉన్నాడు.

Related Posts