టైగర్ నాగేశ్వరరావు..ఏడు కోట్లతో భారీ సెట్..

రవితేజ కెరీర్‌లో ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ వేరు. ఇప్పుడు చేస్తున్న టైగర్‌ నాగేశ్వరరావు వేరు. ఆయన కెరీర్‌ మొత్తం మీద ఏ సినిమాకూ ఖర్చుపెట్టనంతగా ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నారు మేకర్స్. ఒన్లీ సెట్స్ కోసమే దాదాపు 11 కోట్లు ఖర్చుపెడుతున్నారు. స్టువర్టుపురం విలేజ్‌ సెట్‌ని హైదరాబాద్‌లో వేస్తున్నారు. దాని కోసం దాదాపు 7 కోట్లు ఖర్చుపెట్టారు. దాంతో పాటు 4 కోట్ల రూపాయల ఖర్చుతో ఇంకో సెట్‌ వేస్తున్నారు. దీన్ని బట్టి టైగర్‌ నాగేశ్వరరావు సినిమా కోసం మొత్తం 11 కోట్ల రూపాయలు కేవలం సెట్స్ కోసమే ఖర్చు చేస్తున్నారన్నమాట.అంతే కాదు, రవితేజ గత సినిమాల్లో యాక్టింగ్‌కీ, ఈ సినిమాలో యాక్టింగ్‌కీ అసలు పోలికే ఉండదట. రవితేజ కైండ్‌ వాకింగ్‌, టాకింగ్‌, మేనరిజమ్స్, లౌడ్‌ పెర్పార్మెన్స్…

అలాంటివేమీ లేకుండా మొత్తం ఆయన్ని కొత్తగా చూపించడానికి ట్రై చేస్తున్నారట డైరక్టర్‌ వంశీ. రవితేజ బాడీ లాంగ్వేజ్‌లోనూ, గెటప్పుల్లోనూ కంప్లీట్‌ వేరియేషన్‌ని ట్రై చేస్తున్నారు. రవితేజ ఎనర్జీని మ్యాచ్‌ చేసే యాక్షన్‌ సీక్వెన్స్ మాత్రం గట్టిగా ప్లాన్‌ చేస్తున్నారు.టైగర్‌ నాగేశ్వరరావు ఎలా ఉంటారు? ఆయనకు సంబంధించిన అంశాలేంటి అనేవి ఇతమిత్థంగా చెప్పేవారు లేరు.

అందుకే 70ల నాటి పత్రికలను ఆధారం చేసుకుని, వాటిలో ప్రింట్‌ అయిన ఫొటోలను వాడుకుని సెట్స్, కాస్ట్యూమ్స్ డిజైన్‌ చేయించారు. ఈ నెల్లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అనుపమ్‌ ఖేర్‌ చాలా స్పెషల్‌ రోల్‌ ప్లే చేస్తున్నారు. ఆయన కేరక్టర్‌ గురించి ఇప్పుడే విషయాలను రివీల్‌ చేయడానికి ఇష్టపడటం లేదు మేకర్స్. అయితే ఆద్యంతం కొత్తగా ఉండాలంటే, ఆర్టిస్టుల సెలక్షన్‌లోనూ ఫ్రెష్‌నెస్‌ ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పారు డైరక్టర్‌ వంశీ.

Related Posts