“ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ వేడుక‌కు ఆ ఇద్ద‌రు స్టార్ హీరోలు

బాహుబ‌లి త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశంలో ఉన్న సినీ అభిమానులు అంద‌రూ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ఆర్ఆర్ఆర్ జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇటీవ‌ల ముంబాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

టాలీవుడ్ లో కూడా ఈ వేడుకను అంతకు మించి అనేలా చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
అయితే.. ఈ ప్రీ రిలీజ్ వేడుకకి టాలీవుడ్ లోని ఇద్దరు టాప్ హీరోలు హాజరు కానున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఎవ‌రంటే.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అని స‌మాచారం. దీని పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాజమౌళి ఇలాంటి వేడుకలను స్పెషల్ గా ప్లాన్ చేస్తారు. చిరు, బాల‌య్య ఒకే వేదిక పై వ‌స్తే.. మెగా అభిమానులు, నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గే పండ‌గ‌.

అలాగే కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ ల‌లో కూడా స్పెష‌ల్ గా ఈవెంట్స్ చేసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటుగా ఈవెంట్స్ ను ఎప్పుడు..? ఎక్క‌డ‌..? చేయ‌నున్నారు అనేది ఆస‌క్తిగా మారింది. బాహుబ‌లి సెట్ చేసిన రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేస్తుంద‌నే టాక్ గ‌ట్టిగా వినిపిస్తోంది. మ‌రి.. ఆర్ఆర్ఆర్ బాహుబ‌లి రికార్డ్ ను క్రాస్ చేసి చ‌రిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.

Related Posts