సెప్టెంబర్ లో రిలీజ్ డేట్స్ జోరు పెరిగింది

పండగలు వస్తున్నాయంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఆ సందడి చాలా ముందుగా మొదలవుతుంది. ముఖ్యంగా చిన్న, మీడియం రేంజ్ మేకర్స్ ఈ సందడి స్టార్ట్ చేస్తారు. ఎలాగూ ఫెస్టివ్ సీజన్స్ లో బిగ్ స్టార్స్ దే హవా ఉంటుంది కాబట్టి.. అంతకంటే ముందే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రిలీజ్ డేట్స్ లాక్ చేస్తుంటారు. రీసెంట్ గా బింబిసార, సీతారామం కొత్త హోప్ ఇవ్వడంతో ఇప్పుడు టాలీవుడ్ లో రిలీజ్ డేట్ ల జోరు పెరిగింది. అలా వచ్చే నెలలో విడుదలవుతోన్న సినిమాలకు సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నారు.చాలాకాలంగా సాలిడ్ హిట్ కోసం చూస్తోన్న హీరో శర్వానంద్. ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాల హీరో అన్న పేరు తెచ్చుకున్న శర్వా..

రెగ్యులర్ ట్రాక్ లో వచ్చిన తర్వాతే ఫ్లాప్స్ మొదలయ్యాయి. రీసెంట్ గా ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమాతోనూ నిరాశపరిచిన శర్వానంద్ ఇప్పుడు ఒకే ఒక జీవితం అనే సినిమాతో వస్తున్నాడు. ఆ మధ్య విడుదలైన ఈ మూవీ టీజర్ చూస్తే ఇది కూడా టైమ్ ట్రావెల్ లాంటి చిత్రమే అనిపించింది. రీతూ వర్మ హీరోయిన్ గా అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.సెప్టెంబర్ 9నే వస్తోన్న మరో సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని. కిరణ్‌ అబ్బవరపు హీరోగా నటిస్తోన్న చిత్రం ఇది. కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్యదీప్తి నిర్మాత. సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అయితే ఈ హీరో కూడా విజయాల కోసం ఈగర్ గా చూస్తున్నాడిప్పుడు. కథలు బావుంటున్నా.. కథన లోపంతో సినిమాలు పోతున్నాయి. మరి ఈ కుర్రాడికి సెప్టెంబర్ 9 ఎలాంటి న్యూస్ చెబుతుందో..


ఈ యంగ్ హీరోలతో పాటు సెప్టెంబర్ 10న 18 పేజెస్ మూవీతో వస్తున్నాడు నిఖిల్. ప్రస్తుతం ఈ నెల 13న విడుదల కాబోతోన్న కార్తికేయ2 ప్రమోషన్‌స్ లో బిజీగా ఉన్న నిఖిల్ నటించిన 18పేజెస్ తో నెల రోజుల్లోపే సందడి చేయబోతున్నాడు. విశేషం ఏంటంటే.. కార్తికేయ2 హీరోయిన్ అనుపమనే ఈ 18పేజెస్ లోనూ హీరోయిన్. కుమారి 21ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించింది.
యూత్ ఫుల ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ఆకట్టుకునే దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. అతని చివరి సినిమా వి పోయినా.. ఇప్పుడు సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్‌ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. వీల్లు సెప్టెంబర్ 19 ఆ అమ్మాయి గురించి చెప్పేందుకు రాబోతున్నారట.ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో ఇంతకు ముందు సుధీర్ బాబు సమ్మోహనం అనే సినిమా చేశాడు. ఇది క్లాస్ హిట్ గా పేరు తెచ్చుకుంది. మంచి పాటలూ ఉంటాయి.

తర్వాత సుధీర్, నానితో కలిపి చేసిన వి ఓటిటిల్లో వచ్చినా ఫ్లాప్ అనిపించుకుంది. కొంత గ్యాప్ తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను మళ్లీ సుధీర్ తోనే స్టార్ట్ చేశాడు ఇంద్రగంటి. కృతిశెట్టి ఫామ్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. మంచి కంటెంట్ ఉంటే.. ఈ అమ్మాయి గురించి ఆడియన్సే అందరికీ చెబుతారు.ఇక సెప్టెంబర్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు మాస్ రాజా రెడీ అవుతున్నాడు. ఈ మధ్యే వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ పోయినా.. అతను సెప్టెంబర్ 30న దసరా శెలవులను దృష్టిలో పెట్టుకుని పండగకు వారం ముందు నుంచే రావణాసురగా రాబోతున్నాడు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో అనూఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సెప్టెంబర్ కు గ్రాండ్ ఫినిషింగ్ ఇచ్చేది ఈ రావణాసురుడే అవుతాడేమో. మొత్తంగా రెండు హిట్స్ పడగానే టాలీవుడ్ అలెర్ట్ అయింది. అందుకే వరుసగా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ అనౌన్స్ మెంట్స్ ఇంకా పెరుగుతాయి కూడా. మరి వీరిలో విజయపతాకం ఎగరేసేది ఎవరో చూడాలి.

Related Posts