ఈ సారి దసరాకు భారీ సినిమాలు లేవా..

దసరా.. తెలుగు సినిమా పరిశ్రమకు అతి పెద్ద సీజన్స్ లో ఒకటి. పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫైట్ చేస్తుంటే చూస్తోన్న ఆడియన్స్ లో పండగ జోష్ డబుల్ అయిపోతుంది. బావున్న సినిమాలు బ్లాక్ బస్టర్ అవడం.. యావరేజ్ సినిమాలు కూడా ఓకే అనిపించుకోవడం పండగ టైమ్స్ లోనే సాధ్యం. అందుకే ఎప్పుడూ స్టార్ హీరోలే ఈ డేట్స్ ను ఆక్యుపై చేస్తుంటారు. బట్ ఈ సారి అలా కనిపించడం లేదు. అఫ్ కోర్స్ పెద్ద హీరోలున్నారు. కానీ వారివి పెద్ద సినిమాలు అని చెప్పలేం. అలాగే ఇతర సినిమాలను భయపెడతాయి అని కూడా అనుకోలేం.దసరా రోజున వస్తోన్న స్టార్ హీరో సినిమా ఘోస్ట్. నాగార్జున నటించిన సినిమా. ప్రవీణ్ సత్తారు దర్శకుడు.

సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిహ సురేంద్రన్, రవివర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని పుష్కర్ రామ్మోహన్ రావు, సునిల్ నారంగ్, శరత్ మరార్ నిర్మించారు. వీళ్లంతా టాలీవుడ్ లో తోపు బ్యాచ్ కాబట్టి నాగ్ కు భారీ రిలీజ్ ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఇదే టైమ్ కు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కూడా రిలీజ్ ఉంటుందని చెప్పారు. బట్ వీళ్లింకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అందుకేనేమో చిన్న సినిమాలు మెల్లగా కర్చీఫ్‌ వేస్తున్నాయి.మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నిలియోన్ నటిస్తోన్న సినిమా జిన్నా. ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి కథను అందించడం విశేషం. జిన్నా అనే టైటిల్ పై కొన్ని వివాదాలు వచ్చినా విష్ణు వెనక్కి తగ్గడం లేదు. విష్ణు హిట్ అనే మాట విని ఏళ్లవుతోంది కాబట్టి.. ఈ మూవీపై అంత క్రేజ్ ఉంటుందనుకోలేం.

కాకపోతే ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి అదేమైనా కొన్ని టికెట్స్ ను ఎక్స్ ట్రా తెంపుతుందేమో.జిన్నాతో పాటు మరో డెబ్యూ హీరో కూడా దసరాపై కర్చీఫ్‌ వేశాడు. నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు గణేష్‌ హీరోగా పరిచయం అవుతోన్న సినిమా స్వాతిముత్యం దసరా రిలీజ్ అంటూ పోస్టర్ వేశారు. వర్ష బొల్లమ్మ హీరో�