నా క‌ల నెర‌వేరింద‌ంటున్న బుట్ట‌బొమ్మ‌

పూజా హేగ్డే.. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆత‌ర్వాత ముకుంద సినిమా చేసి స‌క్స‌స్ సాధించినా ఆశించిన స్ధాయిలో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో బాలీవుడ్ వెళ్లింది. ఆత‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్ కి వ‌చ్చి డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ్ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించింది. ఇక అక్క‌డి నుంచి ఈ అమ్మ‌డు వ‌రుస‌గా భారీ చిత్రాల్లో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ వ‌రుస విజ‌యాలు అందుకుంది. క్రేజీ హీరోయిన్ అయ్యింది. బాలీవుడ్, టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ బుట్ట‌బొమ్మ తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. ఏంటంటారా… ముంబైలో సొంత ఇంటిని నిర్మించుకుంది.

కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన పూజాహెగ్ధే సంప్రదాయ దుస్తుల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఓ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ రోజు కోసం ఒక సంవత్సరం నుంచి వేచి చూస్తున్నానని, అన్ని కలలు నెరవేరాయని తెలిపింది. అంతే కాకుండా… మిమ్మ‌ల్ని మీరు న‌మ్మి క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తే.. అప్పుడు మీ హృద‌యంతో ఈ ప్ర‌పంచ‌మే ప్రేమ‌లో ప‌డుతుంది అని పోస్ట్ చేసింది. కొత్త ఇంటిలో అడుగుపెట్టిన ఈ బుట్ట‌బొమ్మ‌కు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నారు.

Image

Related Posts