తెలుగు సినిమాకు ఓ హిట్ కావాలి..?

తెలుగు సినిమాకు ఓ హిట్ కావాలి. యస్.. ఇప్పుడు సిట్యుయేషన్ అలాగే ఉంది. విక్రమ్, మేజర్ సినిమాల తర్వాత ఇప్పటి వరకూ ఒక్క హిట్టూ పడలేదు. హిట్ సంగతి దేవుడెరుగు అసలు ఆడియన్స్ ను మినిమం ఆకట్టుకోవడంలో కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఇలాగే ఉంటే ఇండస్ట్రీకే ఇబ్బంది తప్పదు అని ప్రతి ఒక్కరూ గగ్గోలు పెడుతున్నారు. అందుకే ప్రతి శుక్రవారం పరిశ్రమ మొత్తం హిట్ అనే మాట వినిపిస్తుందా లేదా అని ఈగర్ గా చూస్తున్నాయి. ఆ విషయంలో ఈ నెలలో రెండు వారాల సినిమాలు కీలకం కాబోతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా సత్తా ఏంటీ అనేది చూద్దాం..ఈ నెల 14న విడుదల కాబోతోన్న సినిమా ది వారియర్. రామ్, కృతిశెట్టి జంటగా నటించారు. లింగుస్వామి డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్ లోనూ విడుదల కాబోతోంది. ఇప్పటి వరకూ వచ్చిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ప్రమోషన్స్ సైతం వేగంగానే సాగుతున్నాయి. సినిమాపై ఎంటైర్ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. దీంతో రామ్ నుంచే ఇండస్ట్రీకి నెల రోజుల తర్వాత హిట్ అనే టాక్ వస్తుందనే నమ్మకంతో ఉంది పరిశ్రమ. వారియర్ హిట్ అయితే కొత్త జోష్ వచ్చినట్టే అవుతుంది.15న మరో మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇందులో రెండు డబ్బింగ్ సినిమాలున్నాయి. ఒకటి స్ట్రెయిట్ మూవీనే. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి హడావిడీ కనిపించడం లేదు. దీంతో పోస్ట్ పోన్ అయినట్టే అనే వార్తలు వస్తున్నాయి.

ఇక డబ్బింగ్ సినిమాల్లో ఎక్కువగా ఆకట్టుకుంటున్నది గార్గి సినిమా. సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ కంప్లీట్ గా ఓ ఇష్యూ బేస్డ్ గా వస్తోన్న సినిమా అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సాయి పల్లవే ప్రధాన పాత్రగా కనిపిస్తోంది. తెలుగు ఆడియన్స్ కోరుకునే రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా కనిపించడం లేదు కానీ.. సాయి పల్లవి అనే అట్రాక్షన్ గార్గి సినిమాకు తెలుగులో పెద్ద ప్లస్ పాయింట్.చాలా రోజుల తర్వాత ప్రభుదేవా తమిళ్ లో ప్రధాన పాత్రలో నటించిన సినిమా మై డియర్ భూతమ్. తెలుగులోనూ ఈ చిత్రాన్ని అదే పేరుతో 15న విడుదల చేయబోతున్నారు. చిన్న పిల్లలను ఆకట్టుకునేలాంటి కథాంశంతో వస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రభుదేవా గెటప్ కూడా ఆకర్షణీయంగా ఉంది. చిల్ర్డన్ ను ఆకట్టుకుంటే మౌట్ టాక్ తో మెప్పించే అవకాశం ఉంది. కానీ ముందు ఈ సినిమా ఉందన్న విషయం ప్రమోషన్స్ తో తెలియజేయాలి. ఇక అస్సలు ఊసే కనిపించిన మరో సినిమా గుర్తుందా శీతాకాలం. సత్యదేవ్, తమన్న నటించిన ఈమూవీ చాలాకాలంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం.. తర్వాత పోస్ట్ అనడం కామన్ అయిపోయింది. సో వచ్చే శుక్రవారం వస్తుందన్న నమ్మకం లేదు. ఎవరు ఏ కంటెంట్ తో వచ్చినా.. ఇప్పుడు తెలుగు సినిమాకు అర్జెంట్ గా ఓ భారీ హిట్ కావాలి. కొన్నాళ్లుగా అసలు హిట్ అనే మాటే లేకుండా ప్రతి శుక్రవారం థియేటర్స్ అన్నీ ఉసూరుమంటున్నాయి. అది అలాగే కొనసాగితే పరిశ్రమకే ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే ఈ రెండు వారాల్లో వస్తోన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలవాలని కోరుకుందాం..

Related Posts