ad

కొంచెం నీరసంగా  ఫస్ట్ మూవీ హిట్ తో వరుసగా ఆఫర్స్ దక్కించుకున్నాడు కిరణ్‌ అబ్బవరపు అనే కుర్రాడు. స్వయంకృషితో ఎదుగుతున్నాడు అని అంతా అంటున్నారు కూడా. బట్ అతనికి తర్వాత సరైన హిట్స్ పడలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడులా కంటిన్యూస్ గా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. పెద్ద బ్యానర్స్ లో కూడా నటిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన సెబాస్టియన్, సమ్మతమే సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు అతని చేతిలో రెండు సినిమాలున్నాయి. నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ. ఈ రెంటిలో నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ టీజర్ విడుదలైంది. విశేషం ఏంటంటే.. ఒకప్పుడు ఆల్ జానర్స్ మూవీస్ తో బిగ్గెస్ట్ హిట్స్ తీసిన దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్యదీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీధర్ గాదె దర్శకత్వం చేసిన ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనేది ఇంట్రెస్టింగ్ టైటిల్. చూడగానే ఆకట్టుకుంటుంది. పైగా టైటిల్ కు కథలో బాగా జస్టిఫికేషన్ చేయొచ్చు. అందుకు తగ్గట్టుగా మాత్రం ఈ టీజర్ కనిపించలేదు. లవ్ లో పదిసార్లు ఫెయిల్ అయినా పదకొండో ప్రేమ కోసం చూసే సమాజంలో ఉన్నాం అనే డైలాగ్ తో ఈ కథ కొంత వరకూ అర్థమవుతుంది. సినిమాలో పెద్ద తారాగణమే కనిపిస్తోంది.

ముఖ్యంగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కూడా కనిపిస్తున్నాడు. అలాగే కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా కిరణ్ తో పాటు ఫుల్ లెంగ్త్ రోల్ చేసినట్టు కనిపిస్తోంది. లవ్ స్టోరీ అంటూ ఏం కనిపించలేదు కానీ.. లవ్ లో ఫెయిల్ అయిన ఓ అమ్మాయి విపరీతంగా తాగుతూ ఉంటే ఆమెకు సలహాలు ఇస్తున్నాడు కిరణ్‌. సంజనా ఆనంద్, కిరణ్ ఠాకూర్ అనే ఇద్దరు హీరోయిన్లు కనిపించారు. కానీ ఒక్కరూ బాలేదు. పైగా టీజర్ లో వారికి సరైన క్లోజ్ షాట్స్ కూడా పడలేదు. అదీ ఓ రీజన్ కావొచ్చు.విశేషం ఏంటంటే ఈ చిత్రానికి మొదట ఓ దర్శకుడిని తీసుకున్నారు. కానీ అతను సరిగా చేయడం లేదని మధ్యలో మార్చారు. అలాగని కొత్తగా వచ్చినతను డైరెక్ట్ చేశాడనుకోలేం. ఎందుకంటే ఆ బాధ్యత కూడా కిరణ్‌ మీదే పెట్టారు. కాకపోతే ఓ పేరుండాలని ఓ డైరెక్టర్ పేరు వేశారు అంటున్నారు. ఏదేమైనా టీజర్ లో కంటెంట్ స్పష్టంగా కనిపించలేదు. పైగా చాలా అంటే చాలా స్లోగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో కానీ.. ఈఅందరికీ కావాల్సిన కుర్రాడు మాత్రం మరీ నెమ్మదిగా ఉన్నాడనే చెప్పాలి.

, , , , , ,