ది కేరళ స్టోరీకి షాక్ ఇచ్చిన తమిళనాడు మల్టీప్లెక్స్ థియేటర్స్

ది కేరళ స్టోరీ.. ప్రస్తుతం దేశంలో సరికొత్త వివాదాన్ని రాజేస్తోన్న సినిమా. గతంలో వచ్చిన కశ్మీర్ ఫైల్స్.. తరహాలోనే ఇది కూడా ఒక వర్గం వారి కోసం మరో వర్గం వారిని కించపరుస్తూ తీసిన చిత్రం అని అభ్యుదయ వాదులంతా చెబుతున్నారు. అయితే అసలు కేరళ స్టోరీ అనే చిత్రం కథ ఏంటీ అనేది ఓ సారి బ్రీఫ్‌ గా చూద్దాం..


ది కేరళ స్టోరీ
అనేది ముగ్గురు అమ్మాయిల కథ. భారత్ లోని వివిధ రాష్ట్రాల నుంచి కేరళలో చదువుకునేందుకు వస్తారు. యూనివర్శిటీలో వారికి ఓ ముస్లీం యువతి ఫ్రెండ్ అవుతుంది. తను వారిని మభ్య పెట్టి ముస్లీం కుర్రాళ్లతో ప్రేమలో పడేలా చేస్తుంది. అటుపై వారిని అక్రమంగా దేశం దాటించి టెర్రరిస్ట్స్ గా మార్చే ప్రయత్నం చేస్తారు. ఇదీ కథ. అయితే ఇది ఈ ముగ్గురి కథగా మాత్రమే చెబితే కొంత వరకూ ఇంత వివాదం వచ్చేది కాదు.

మరి వివాదం ఎక్కడ, ఎందుకు మొదలైందీ అంటే..?
2010లో నాటి కేరళ సిఎమ్ విఎస్ అచ్యుతానందన్.. కేరళ రాష్ట్రంలో యేటా 2800 మంది వరకూ మహిళలు మిస్ అవుతున్నారు అని చెప్పాడు. నిజానికి ఇది ప్రతి రాష్ట్రంలోనూ కనిపించే గణాంకం. మహిళలు అనే కాదు. చాలామంది మిస్సింగ్ కేస్ లు నమోదు అవుతుంటాయి. ఆ కోణంలో ఆయన చెప్పినట్టుగా అప్పుడే అన్నారు.

అయితే ఆ మిస్ అయిన వాళ్లంతా కేవలం హిందూ మహిళలే అని.. వారిని ముస్లీంస్ లవ్ జిహాద్ గా మార్చి.. ఆఫ్ఘానిస్తాన్ లోని టెర్రరిస్ట్ గ్రూపుల్లో చేర్చి.. ఐసిస్ మెంబర్స్ గా మార్చారని.. అంతే కాక.. వారిని టెర్రరిస్ట్స్ సెక్స్ టాయ్స్ గా వాడుకున్నారు అని కొత్త లెక్కలు తీసి సుదీప్తో సేన్ అనే దర్శకుడు.. అప్పటి నుంచి మిస్అయిన మహిళలు అనే ఓ లెక్క తీసి ఇప్పటి వరకూ 30వేల మంది వరకూ హిందూ మహిళలను లవ్ జిహాద్ గా మార్చారని కథ అల్లేసి సినిమాగా తీశాడు.

ట్రైలర్ రిలీజ్ తర్వాతే ఈ చిత్రంపై అనేక విమర్శలు వచ్చాయి. అఫ్‌ కోర్స్ దానికి సపోర్ట్ చేసిన వారూ ఉన్నారు. కేరళ ప్రభుత్వం బ్యాన్ విధించింది. దీంతో దర్శకుడు.. 30వేల మంది గురించి నాకుతెలియదు. ఇది కేవలం ఆ ముగ్గురు అమ్మాయిల కథే అంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేశాడు. బట్ ఇది పూర్తిగా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి తీసిన సినిమా అని గత శుక్రవారం విడుదలైన తర్వాత చూసిన వారంతా చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని నిషేధించారు.


తాజాగా తమిళనాడు మల్టీప్లెక్స్ అసోసియేషన్ కూడా ఈ చిత్రంపై బ్యాన్ విధించింది. విశేషం ఏంటంటే.. ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు. అసోసియేషనే.. ఈ చిత్రం సమాజానికి చాలా హానికరంగా ఉంది. అనేక విధ్వంసాలు కారణం అవుతుంది అని వాళ్లే తీర్మానించారు.


ఇక సినిమా రిలీజ్ కు ముందు ఈ తరహా సినిమాలు సమాజానికి మంచివి కావు అని చెప్పాడు ప్రధాన మంత్రి మోదీ. బట్.. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మాత్రం ఈ చిత్రాన్ని ప్రచారం చేస్తున్నాడు. దీన్ని బట్టే ఈ సినిమా అసలు ఉద్దేశ్యం ఏంటనేది నిర్ణయించుకోవచ్చు.

Related Posts