‘హిందీ’పై సుదీప్, అజయ్ దేవ్ గణ్ ల ట్విట్టర్ వార్

హిందీ రాష్ట్రీయ భాష. ప్రతి ఒక్కరూ నేర్చుకుని తీరాల్సిందే అని బెజెపి ప్రభుత్వం అవకాశం వచ్చిన ప్రతిసారీ చెబుతోంది. కానీ మనది ఫెడరల్ కంట్రీ అని.. అన్ని రాష్ట్రాలకూ మాతృభాషలు ఉన్నాయి కాబట్టి.. బలవంతంగా ఒక భాషను ఇతర రాష్ట్రాలపై రుద్దడం కరెక్ట్ కాదని ఆయా రాష్ట్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సౌత్ నుంచి తమిళ్ హీరోలు గళమెత్తుతున్నారు. వారికి తోడుగా తాజాగా కన్నడ టాప్ స్టార్ సుదీప్ వచ్చి చేరాడు. హిందీని రాష్ట్రీయ భాషగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం అని రీసెంట్ గా ట్వీట్ చేశాడు సుదీప్.

దీనికి బదులుగా అతన్ని ట్యాగ్ చేస్తూ.. అజయ్ దేవ్ గణ్ హిందీలో ఓ మెసేజ్ పంపించాడు. హిందీ అంటే రాష్ట్రీయ భాషే అని ఒప్పుకోవాలని అందులో తీర్మానించినట్టుగా చెప్పాడు అజయ్. పైగా హిందీ దేశ భాష కానప్పుడు మీ సినిమాలు ఇక్కడ ఎందుకు డబ్ చేస్తున్నారు అంటే విచిత్రంగా ఓ ప్రశ్న అడిగాడు. దీనికి సుదీప్ కూడా బదులు ఇచ్చాడు.
‘‘ అందుకే మేము కూడా హిందీని ప్రేమిస్తాం, గౌరవిస్తాం నేర్చుకుంటున్నాం సర్. అందులో ఇబ్బందేమీ లేదు. కానీ నేను కూడా కన్నడలో టైప్ చేస్తే పరిస్థితి ఏంటా అనేది నా ప్రశ్న. మనమంతా భారతీయులం కాదా సర్’’ అంటూ తెలివిగా కౌంటర్ ఇచ్చాడు సుదీప్.

దీనికీ అజయ్ రిప్లై ఇచ్చాడు. ‘‘సుదీప్ నువ్వు నా ఫ్రెండ్ వే. నా ప్రశ్నను క్లియర్ చేసినందుకు సంతోషం. నేను ఎప్పుడూ సినిమా అంతా ఒకటే అనుకుంటాను. మేము మీ భాషలను గౌరవిస్తాం. మీరు కూడా మా భాషను గౌరవించాలని చెప్పాలనుకున్నాను. కానీ ఎక్కడో టైపో మిస్టేక్ అయింది’’ అంటూ తప్పించుకున్నాడు అజయ్ దేవ్ గణ్.
‘‘ఒక భాషను ట్రాన్స్ లేట్ చేయడం వేరు.. రుద్దడం వేరు సర్. ఏ విషయాన్ని/ విషయాలను తెలియంకుండా రియాక్ట్ కావొద్దు. అయినా మీరంటే నాకు గౌరవమే. పైగా మీరు నా ట్వీట్ కు రియాక్ట్ అయినందుకు సంతోషంగా ఉంది’’ అని మరోసారి హుందాగా బదులిచ్చాడు సుదీప్.

మొత్తంగా ఈ స్టార్ హీరోల ట్విట్టర్ వ్యవహారం ఇద్దరు హీరోల అభిమానుల్లోకి వెళ్లింది. ఒకరిని మించిన దిగజారుడు కమెంట్స్ తో బూతులు తిట్టుకుంటున్నారు. అయినా బహుళ భాషలున్న దేశంలో ఒక భాషే అందరిదీ ఎట్లా అవుద్దిరా డికే బోస్ లు అని అనాలని మనకు మాత్రం ఉండదా చెప్పండి.. అదన్నమాట.

Related Posts