ఐసీయూలో గాయని ల‌తా మంగేష్క‌ర్

ప్రముఖ గాయని, భార‌త‌ర‌త్న‌ లతా మంగేష్కర్ అస్వస్థత గురయ్యారు. ఆమె ఆదివారం అర్ధరాత్రి 1.30 సమయంలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ప‌డ్డారు. దీనిని గ్రహించిన కుటుంబ స‌భ్యులు వెంటనే ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. గత కొన్ని రోజులుగా ఆమెకి శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. అది కాస్త ఇప్పుడు సీరియస్ అయిందని సమాచారం. పరీక్ష చేస్తే.. క‌రోనా పాజిటివ్ అని తేలింది. వైద్యులు ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని హాస్పిటల్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆమె వ‌య‌సు 92 సంవ‌త్స‌రాలు. ఆమెకు క‌రోనా వ‌చ్చి హాస్ప‌ట‌ల్ లో చేరార‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి క‌రోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగా రావాల‌ని బాలీవుడ్ సెల‌బ్రీటీలు కోరుకుంటున్నారు. ఒక్క హిందీలోనే వెయ్యికి పైగా పాటలు పాడిన ఆమె భారత రత్న అవార్డు సొంతం చేసుకున్నారు.

అలానే 2001లో ది హయ్యెస్ట్ సివిలియన్ హానర్ అనే అవార్డుని దక్కించుకున్నారు. నవంబర్ 10 ఆదివారం నాడు లతా మంగేష్కర్ తన ట్విట్టర్ లో తన మేనకోడలు పద్మిని ,నటించిన పానిపట్ సినిమా పోస్టర్ ని షేర్ చేస్తూ ఆమెకి విషెస్ చెప్పారు. ఇప్పుడు ఆమె ఆనారోగ్యం పాలవ్వడంతో కుటుంబసభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts