‘సలార్’తో రాబోతున్న ‘ఈగల్’ ట్రైలర్

రాబోయే సంక్రాంతి బరిలో ఆరు సినిమాలు ఉంటాయనుకున్నారు. అయితే.. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. అలాగే మాస్ మహారాజ రవితేజ ‘ఈగల్’ కూడా సంక్రాంతి బరిలో ఉండదనే ప్రచారం జరిగింది. కానీ.. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేస్తున్నారు నిర్మాతలు. ‘ఈగల్’ సంక్రాంతికి పక్కా అంటూ సంకేతాలందిస్తున్నారు.

ఇప్పటికే ‘ఈగల్’ నుంచి రిలీజైన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. హై ఇంటెన్స్ ఎమోషన్స్ తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ మూవీలో రవితేజ లుక్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఏదో కొత్త పాయింట్ ను డీల్ చేసినట్టు అర్థమవుతుంది. ఇక.. లేటెస్ట్ గా ఈ చిత్రం ట్రైలర్ ను డిసెంబర్ 22న రాబోతున్న ‘సలార్’ మూవీతో ఎటాచ్ చేయనున్నారట.

సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘ఈగల్’ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక కాగా నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, కావ్యథాపర్ ఇతర కీ రోల్స్ లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ‘ఈగల్’ రూపొందుతోంది.

Related Posts