“పుష్ప పార్ట్ 2” కి షాకింగ్ ఆఫ‌ర్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ముఖ్యంగా నార్త్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం అంద‌రికీ షాక్ అనే చెప్పాలి. దీంతో అల్లు అర్జున్ ఇమేజ్ అమాంతం పెరిగింది. దీంతో బ‌న్నీతో భారీ పాన్ ఇండియా మూవీ చేసేందుకు బ‌డా నిర్మాత‌లు క్యూక‌డుతున్నారు. టాలీవుడ్ నుంచే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ బ‌న్నీతో సినిమా చేసేందుకు భారీ రెమ్యూన‌రేష‌న్ ఆఫ‌ర్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… పుష్ప 2 షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు అప్పుడే పుష్ప 2 కి భారీ ఆఫ‌ర్స్ వ‌స్తుండ‌డం విశేషం. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… ఈ సినిమాకి ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ ఏకంగా 400 కోట్ల మేర ఆఫర్ ఇచ్చింద‌ట‌ కానీ.. మేకర్స్ అందుకు నో చెప్పేశారట. ఇంకా షూటింగ్ స్టార్ట్ కానీ ఈ మూవీకి 400 కోట్ల ఆఫ‌ర్ రావ‌డం అంటే సంచ‌ల‌న‌మే. ఈ వార్త‌లో ఎంత వాస్త‌వం ఉందో తెలియ‌దు కానీ.. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయ్యింది.

పుష్ప 2 చిత్రం షూటింగ్ ఫిబ్ర‌వ‌రి లేదా మార్చి నుంచి స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీని ద‌స‌రా లేదా క్రిస్మ‌స్ కి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. మ‌రి… భారీ అంచ‌నాలు ఉన్న పుష్ప 2 ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related Posts