సందీప్ కిషన్ , లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లు గా 2017 లో తమిళ్ లో విడుదలయి మంచి హిట్ అయిన సినిమా ప్రాజెక్ట్ జెడ్ మాయావన్. సివి కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా యాక్షన్ ప్రేమికులను , సైన్స్ ఫిక్షన్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కి రంగం సిద్దమైంది. ఇందులో సందీప్ కిషన్‌తో పాటు హిందీ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సివి కుమార్ డైరెక్షన్‌లో తెలుగులో ఏకె ఎంటర్‌టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సైన్స్‌ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ని అడ్వంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సమర్పిస్తోంది.
మాయావన్ సీక్వెల్‌లో సందీప్ కిషన్‌కు జోడీగా ఆకాంక్ష రంజన్ కపూర్ నటిస్తోంది. రీసెంట్‌గా సందీప్ కిషన్, నీల్‌నితిన్ ముఖేష్ ల పవర్‌ప్యాక్డ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. వీరి మేకోవర్ యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉందంటున్నారు.
ఓ సూపర్ పవర్స్ ఉన్న విలన్‌తో సాధారణ మనిషి ఘర్షణ పడతాడు. సైంటిఫిక్ అంశాలతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండే ఈ చిత్రం ఆడియెన్స్‌ని థ్రిల్ చేయబోతుందంటున్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.