కొత్త టాలెంట్‌ను ప్రోత్సాహించే ‘నక్కిన నేరేటివ్స్‌’

సినిమా ఇండస్ట్రీలో కొత్తవారిని ప్రోత్సాహించడం ఎంతో ముఖ్యం. కొత్త టాలెంట్‌ వస్తేనే తెలుగు సినిమా కొత్తపుంతలు తొక్కుతుంది. మూస ఫార్ములాకు భిన్నంగా ఈ తరం కొత్త కొత్త కథలకు అవకాశం ఉంటుంది. అందుకే కొత్తవారిని ప్రోత్సాహించడానికి ప్రముఖ డైరెక్టర్ నక్కిన త్రినాధరావు గారు ఓ సరికొత్త బ్యానర్‌ను స్థాపించారు. అదే ‘నక్కిన నేరేటివ్స్’ .


మారుతున్న కాలానికి అనుగుణంగా.. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ‘నక్కిన నేరేటివ్స్‌’ సంస్థ నుంచి సినిమాలు నిర్మించడానికి త్రినాధరావుగారు రంగం సిద్దం చేసారు.
ఈ సంస్థ నుంచి రాబోయే తొలిచిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు.
”న్యూ ఏజ్ కంటెంట్, ట్యాలెంట్, కొత్త కథలని ప్రోత్సహించడం కోసం స్థాపించిన బ్యానర్ ఇది. మంచి యంగ్ ట్యాలెంట్ వున్న వారితో ఓ సినిమాని చేశాం. షూటింగ్ పూర్తి కావచ్చింది. తర్వలోనే టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తాం” అని తెలిపారు దర్శకుడు త్రినాథరావు నక్కిన .

Related Posts