చేతిలో పైసా.. మూతిపై సీసా .. ఊపేస్తోన్న పూజాహెగ్డే సాంగ్

సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ వస్తుందంటే ఆడియన్స్ లో ఆ మూవీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. అలాంటి సినిమా ఎఫ్3. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఎఫ్2కి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 ఈ నెల 27న విడుదలకు సిద్దమైంది. ఇప్పటికే కొన్ని సాంగ్స్, ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన మేకర్స్…ఇవాళ మరో స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. పూజా హెగ్డే చేసిన ఈ సాంగ్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ఎఫ్3. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఎఫ్2కి ఈ సినిమా సీక్వెల్. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఎఫ్3లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించారు. అయితే సునీల్, సోనాల్ చౌహాన్ కొత్తగా యాడ్ అయ్యారు. ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఎఫ్3 ఈ నెల 27న విడుదలవుతోంది.

ఫ్3కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే కొన్ని సాంగ్స్ రిలీజై సూపర్ సక్సెస్ అయ్యాయి. అలాగే రీసెంట్ గా వచ్చిన ధియేట్రికల్ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు మేకర్స్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. సినిమాపై మంచి బజ్ కనిపిస్తోంది.
ఎఫ్3 నుంచి మరో సాంగ్ ని ఇవాళ రిలీజ్ చేశారు. ఈ పాటలో పూజా హెగ్డే నటించింది. వెంకటేష్, వరుణ్ తేజ్, పూజా హెగ్డే మీద ఈ పాట సాగుతుంది. దేవీశ్రీ ప్రసాద్ క్యాచీ ట్యూన్ ఇచ్చాడు. పార్టీ సాంగ్ ఇది. అలాగే ఈ పాటలో సునీల్, రాజేంద్రప్రసాద్ కూడా ఉన్నారు. ఖచ్చితంగా పూజా హెగ్డే గ్లామర్ ఈ పాటకి స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతుంది. మొత్తంగా ఎఫ్3కి మేకర్స్ ఫుల్ గా ప్రమోషన్స్ చేసి, బచ్ పెంచుతున్నారు.

Related Posts