తేజ కోసం ‘రాక్షస రాజా‘గా మారుతోన్న రానా

టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా కెరీర్ లో ‘నేనే రాజు నేనే మంత్రి‘ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది. నటుల నుంచి నటనను రాబట్టుకోవడంలో దిట్టైన తేజ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందింది. ఓ సాధారణ పౌరుడు రాజకీయాల్లో అత్యున్నత్త స్థానానికి ఎలా ఎదిగాడు. ఆ క్రమంలో అతను ఎలాంటి దారుణాలు చేయాల్సి వచ్చిందనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీలో రానా క్యారెక్టర్ నెగటివ్ గా సాగుతోంది. ఈ మూవీలో జోగేంద్ర పాత్రలో రానా నట విశ్వరూపాన్ని చూపించాడు.

‘నేనే రాజు నేనే మంత్రి‘ తర్వాత మరోసారి రానా-తేజ రీ యునైట్ అవుతున్నారు. వీరిద్దరి కాంబోలో రెండో సినిమా అనౌన్స్ అయ్యింది. ఈ చిత్రానికి ‘రాక్షస రాజా‘ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈరోజు రానా బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడించనున్నారట.

Related Posts