రణ్ బీర్ ‘రామాయణ్‘లో రకుల్ ప్రీత్ సింగ్

‘హనుమాన్‘ తర్వాత మళ్లీ పాన్ ఇండియా లెవెల్ లో డివోషనల్ ట్రెండ్ మరింత ఊపందుకుంది. పురాణ పురుషుడు శ్రీరాముడు కథతో ‘రామాయణ్‘ను తెరకెక్కించేందుకు ‘దంగల్‘ ఫేమ్ నితీష్ తివారి సన్నాహాలు చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ లా ‘రామాయణ్‘ని తీర్చిదిద్దేందుకు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలోని నటీనటులను పలు భాషలను నుంచి ఎంపిక చేసుకుంటున్నాడు నితీష్ తివారి.

శ్రీరాముడుగా రణ్ బీర్ కపూర్ నటించే ఈ మూవీలో సీతగా సాయిపల్లవి నటిస్తుందనే ప్రచారం ఉంది. రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషణుడి పాత్రలో విజయ్ సేతుపతి నటించడానికి అంగీకారం తెలిపారనే వార్తలు కూడా వచ్చాయి. లేటెస్ట్ గా ఈ మూవీలో రావణుడి చెల్లెలు అయిన శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నట్టు బాలీవుడ్ టాక్.

పురాణాల్లో శూర్పణక రాక్షసిలా కనిపిస్తుంది. అయినా.. ఆమె చాలా అందంగా ఉంటుందని.. అందుకే లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోశాడని అంటారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ డమ్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఆశించిన ఆఫర్లేమీ అందుకోలేదు. మరి.. ‘రామాయణ్‘లో రకుల్ ఎంట్రీపై త్వరలోనే ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

Related Posts