రాజశేఖర్ కు పోటీగా వస్తోన్న నాగశౌర్య

యాంగ్రీ మేన్ రాజశేఖర్ గరుడవేగతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేయాలనుకున్నాడు. కల్కి తర్వాత కరోనా ప్రాబ్లమ్ తో అప్పటికే మొదలైనా మూడు నాలుగు సినిమాలు ఆగిపోయాయి. ఆ టైమ్ లోనే మళయాలంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ చిత్రాన్ని చూసి తన ఇమేజ్ కు బాగా సరిపోతుందనుకున్నారు. రీమేక్ రైట్స్ తీసుకుని శేఖర్ అనే టైటిల్ తో ఓ దర్శకుడితో సినిమా ప్రారంభించారు. కానీ దర్శకుడితో వచ్చిన డిఫరెన్సెస్ వల్ల.. జీవితనే కెప్టెన్ చైర్లోకి వచ్చింది. చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటోన్న శేఖర్ రీసెంట్ గా చిత్రీకరణ ముగించుకుంది. ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కథగా వస్తోన్న ఈ చిత్రంలో రాజశేఖర్ ఎపిసోడ్ లో ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉండే అతని జీవితంలో కూతురుతో పాటు భార్య వల్ల ఓ కొత్త విషయం తెలుస్తుంది. దాన్ని తెలుసుకునేందుకు తను మళ్లీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి.. ఓ బిగ్గెస్ట్ స్కామ్ ను బయటపెడతాడు. నిజానికి ఈ కథ రాజశేఖర్ కు బాగా సరిపోతుంది. ఇక ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇక గతంలోనే విడుదల కావాల్సి ఉన్నా.. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన చిత్రం కృష్ణవృంద విహారి. నాగశౌర్య, షిర్లే సేతియా జంటగా నటించిన ఈ చిత్రం శౌర్య సొంత బ్యానర్ లోనే రూపొందింది. అలా ఎలా, గాలి సంపత్ ఫేమ్ అనీష్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ తో కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తోన్న చిత్రం ఇదీ అని తెలుస్తోంది. చివరగా ఈ నెల 22న విడుదల అనుకున్నారు కానీ కెజీఎఫ్ దూకుడు వల్ల ఆపేశారు. దీంతో మే ఫస్ట్ వీక్ లో వస్తుందనుకున్నారు చాలామంది. బట్.. అప్పుడు కూడా రాకుండా రాజశేఖర్ ‘‘ శేఖర్’’తో పాటుగా మే 20న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే ఆ ముందు వారం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారువారి పాట ఉంది. ఈ చిత్రానికి వీరికి పది రోజుల గ్యాప్ ఉంటుంది కాబట్టి.. ధైర్యంగా థియేటర్స్ లోకి ఎంటర్ అవ్వొచ్చు అనుకున్నారేమో.. మే 20 బరిలోకి దిగుతున్నారీ ఇద్దరూ.

Related Posts