రాజశేఖర్ పాట వదిలాడు.. మేటర్ చెప్పలేదు

ఒకప్పుడు యాంగ్రీమేన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు రాజశేఖర్. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో అదరగొట్టాడు. అల్లరి ప్రియుడుతో లవర్ బాయ్ గానూ మెప్పించగలనని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే గత దశాబ్ధంలో బాగా వెనకబడ్డాడు. దీంతో రాజశేఖర్ పని ఐపోయిందని చాలామంది భావించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సిందే అన్నారు కూడా. అందుకు టెంప్ట్ అయిన రాజశేఖర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా కూడా చేశాడు. హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. కానీ అంతకు ముందే అతనో గ్రేట్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. అదే గరుడవేగ.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన గరుడవేగతో బౌన్స్ బ్యాక్ అయిన రాజశేఖర్ తర్వాత కల్కి అనే చిత్రంతో మెప్పించాడు. అటుపై మూడు నాలుగు సినిమాలు ఓపెన్ అయినా ఎందుకో వర్కవుట్ కాలేదు. ఫైనల్ గా తనకు బాగా కలిసొచ్చిన రీమేక్ తో రాబోతున్నాడు. మళయాలంలో సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ జోసెఫ్ ను శేఖర్ గా రీమేక్ చేస్తున్నాడు. జీవిత రాజశేఖర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో రాజశేఖర్ గెటప్ డిఫరెంట్ గా ఉంది. వయసు మల్లిన, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడతను. ముఖ్యంగా క్రైమ్ సీన్ ఎక్స్ పర్ట్ గా కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. చంద్రబోస రాసిన ఈ గీతాన్ని విజయ్ ప్రకాష్, అనూప్ రూబెన్స్, రేవంత్ పాడారు.
‘బొట్టుపెట్టీ కాటూకెట్టి వచ్చిందమ్మా సిన్నదీ.. బుగ్గమీదా సుక్కేపెట్టి సిగ్గే పడుతు ఉన్నదీ’అంటూ సాగే ఈ గీతాన్ని సింపుల్, అండ్ వెరీ క్యాచీ ట్యూన్ తో కంపోజ్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. ఓ కేస్ ఇన్వెస్టిగేషన్ కు వెళుతున్న శేఖర్ టీమ్ దారిలో తమ ప్రేమకథలను వినిపించే క్రమంలో వచ్చే పాటలా కనిపిస్తోందిది. ఇక రాజశేఖర్ తో పాటు అభినవ్ గోమటం తో పాటు ఇతర ప్రధాన టీమ్ కూడా ఉంది. ఇక ఈ గీతాన్ని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరించినట్టున్నారు. ఈ ప్రాంతంతో పాటు అక్కడి జనాలను కూడా పాటలో భాగం చేశారు. ఇది కూడా ఇంకా బావుంది.
అయితే శేఖర్ చిత్రాన్ని సంక్రాంతి బరిలో విడుదల చేస్తారు అనే ప్రచారం బాగా జరిగింది. ఆ విషయం ఈ పాటతో పాటు చెబుతారు అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదు. కేవలం పాటను మాత్రమే విడుదల చేసిందిటీమ్. విడుదలకు సంబంధించిన ఎలాంటి వార్తా చెప్పలేదు. మరి ఈ శేఖర్ సంక్రాంతికి వస్తున్నట్టా రానట్టా..?

Related Posts