రాజమౌళి వర్సెస్ మణిరత్నం.. విన్నర్ ఎవరు..

ఒక పెద్ద సినిమా వస్తోందంటే.. ఆల్రెడీ వచ్చిన పెద్ద సినిమాలతో వాటికి కంపేరిజన్ స్టార్ట్ కావడం కామన్. అయితే ఆ కంపేరిజన్ కేవలం విజువల్ గ్రాండీయర్ వల్లో, లేక కంటెంట్ సిమిలారిటీస్ వల్లో కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అంచనాలు తప్పుతాయి. ఎందుకంటే కంటెంట్ భిన్నం అనేది స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మళ్లీ పోలికలు అవసరం లేదు. ఒకవేళ పోల్చి చూసినా.. ఎవరిది పై చేయిగా ఉంటుందనేది సులువుగానే చెప్పేయొచ్చు. అందుకు ఇప్పుడు వస్తోన్న పొన్నియన్ సెల్వన్1 తో పాటు బాహుబలి సినిమాలను ఉదాహరణలుగా చెప్పొచ్చు. ఈ ఉదాహరణ ఎందుకూ అంటే ప్రస్తుతం చాలామంది మణిరత్నం పొన్నియన్ సెల్వన్.. రాజమౌళి బాహుబలిని దాటుతుందా లేదా అనే లెక్కలు వేస్తున్నారు. దీనికి తోడు రెండు సినిమాలూ రెండు భాగాలుగా వస్తాయని చెబుతున్నారు కాబట్టి.. ఈ పోలికలు పెరుగుతున్నాయి. బట్ కంటెంట్ పరంగా చూస్తే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ స్పాన్ చాలా తక్కువ. రాజమౌళి బాహుబలికి విస్తృతమైన స్పాన్. అందుకే ఈ రెండిటికీ అసలు పోలికే పెట్టలేము..

అలాగే పొన్నియన్ సెల్వన్.. బాహుబలిని దాటదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు కూడా.బాహుబలి ఓ చందమామ కథలాంటిది. ఇలాంటి కథలు అన్ని దేశాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి. చిన్నప్పుడు అనగనగా ఓ రాజు అనే మాట వినని వారు ఉండరు. అందుకే ఈ మూవీ కనెక్టివిటీ ఆ రేంజ్ లో ఉంది. ఈ రాజు ఏ ప్రాంతం వాడు, ఏ భాష వాడు, ఏ రాజ్యం వాడు అనేది పర్టిక్యులర్ గా లేదు. అందుకే అమరేంద్ర బాహుబలి అన్ని దేశాల్లోనూ అద్భుతమైన ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని కూడా సొంతం చేసుకుని రికార్డులు సృష్టించాడు.కానీ పొన్నియన్ సెల్వన్ కు ఈ ఫెసిలిటీ లేదు. పొన్నియన్ సెల్వన్ అనే వ్యక్తి చోళ రాజ్య స్థాపకుల్లో మొదటి తరానికి చెందిన వాడు. వెయ్యేళ్ల క్రితం తమిళనాడులోని తంజావూరు, మధురై ప్రాంతాల్లో విస్తరించుకుని చోళులు, పల్లవులు, పాండ్యుల కథలు ఆ రాష్ట్రంలో విస్తృతంగా కథలుగా, చరిత్రగా కనిపిస్తాయి. అంటే ఈ కథ పర్టిక్యులర్ గా ఒక ప్రాంతానికి చెందినది.

అంటే మరో ప్రాంతం వ్యక్తి ఆ కథకు ఎంత మేరకు కనెక్ట్ అవుతాడు అనే పెద్ద ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. అలా చూస్తే చోళుల పాలన గురించి తమిళనాటే భిన్నమైన అభిప్రాయాలున్నాయి. అక్కడ వారిది స్వర్ణయుగం అని మెజారిటీ ప్రజలు చెప్పుకున్నా.. ఇంకా చాలామంది మూఢ నమ్మకాలు, సామాజిక అసమానతలు, అణచివేతల విషయంలో చోళుల పాలన కాస్త దుర్మార్గంగానే ఉండేది అనే వాదన కూడా ఒక వర్గం చరిత్రకారులు చెప్పుకున్న మాట. సో.. ఇలాంటి కథను అన్ని ప్రాంతాలకూ నచ్చేలా చెప్పడం కత్తిమీద సాములాంటిది.అంతెందుకు.. బాహుబలి, భల్లాల దేవుడు అనగానే మనకు ఏ ప్రాంతం వ్యక్తి పేర్లు ఇవి అన్న డౌట్ రాలేదు. అందుకే ఆ పాత్ర, కథ అందరికీ కనెక్ట్ అయ్యింది. అదే పొన్నియన్ సెల్వన్ లోని ఆదిత్య కరికాలన్, అరుణ్ మొళి వర్మ, పల్లవరాయ వంధ్య దేవుడు..

ఇలాంటి పేర్లు విన్నప్పుడు ఖచ్చితంగా ఓ ప్రాంతీయత్వం ఆపాదించబడుతుంది. అప్పుడు ఆ ప్రాంతం వారు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. కానీ ఇతర ప్రాంతాల వారూ.. ఆ పేర్లు, చరిత్రతో కనెక్ట్ అవడం చాలా కష్టం. అద్భుతమైన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే ఉంటే, అదీ సినిమాటిక్ గా మెప్పించగలిగితేనే ఇతర ప్రేక్షకుల ఆదరణ దక్కుతుంది.అందువల్ల బాహుబలి కంటే పొన్నియన్ సెల్వన్ గొప్పగా ఉండబోతోంది అనే మాట అప్పుడే చెప్పలేం. ఎప్పుడూ చెప్పాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే బాహుబలి ఓ కల్పితమైన ప్రాంతాలకతీతమైన జానపద గాథ.పొన్నియన్ సెల్వన్.. చరిత్రలో ఒక ప్రాంతంలో జరిగిన యదార్థ గాథకు సినిమానువాదం. రెండూ భిన్నమైనవి.ఇంక ఎవరు గొప్ప అనే ప్రశ్నే అనవసరమేమో.

Related Posts