బాలీవుడ్ 50 కోట్ల క్ల‌బ్ లో “పుష్ప‌”

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ పాన్ ఇండియా మూవీ సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా రికార్డ్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. అలాగే ఓవ‌ర్ సీస్ లో కూడా రికార్డ్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే తెలుగు, మలయాళంలో అగ్ర హీరోగా హోదాను ఆస్వాధిస్తున్న అల్లు అర్జున్ కు హిందీ మార్కెట్లోనూ భారీ ఫాలోయింగ్ ఏర్పడుతోంది. అక్కడ బాక్సాఫీస్ వద్ద పుష్ప ది రైజ్ సాధిస్తున్న వసూళ్లు ట్రేడ్ పండితుల‌కు సైతం షాక్ ఇస్తున్నాయి.

పుష్ప హిందీ వెర్షన్ వారాంతానికి 10 కోట్ల నెట్ తో రూ. 4.25 కోట్ల నికర వసూళ్లు చేసింది. రెండవ వారాంతంలో ఈ ఎంటర్ టైనర్ కేవలం 15 శాతానికి పడిపోయింది. 10 రోజులు ముగిసేసరికి ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 28 కోట్ల రూపాయల డీసెంట్ వసూళ్లను సాధించింది. ఇక రెండో వీకెండ్ నాటికే 37కోట్ల వసూళ్లకు చేరింది. ముంబై (సిటీ) సర్క్యూట్ లో దాదాపు 15 కోట్ల నికర వసూళ్లతో దాదాపు 4.75 కోట్ల నెట్ ని రాబట్టి అసాధారణమైన వసూల్ ని సాధించింది.

పుష్ప హిందీకి గుజరాత్ మార్కెట్ లోనూ మంచి ఆదరణ లభించింది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ యాక్షన్ డ్రామా రూ. 50 నుంచి 60 కోట్ల వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే పుష్ప 50 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. అక్క‌డ అంత‌గా ప్ర‌చారం చేయ‌క‌పోయినా పుష్ప ఈ రేంజ్ లో వ‌సూలు చేస్తుండ‌డం బ‌న్నీకి నార్త్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెబుతుంది అంటున్నారు సినీ జ‌నాలు.

Related Posts