నేను రోమియో టైప్ కాదంటున్న ప్రభాస్

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా రాధే శ్యామ్ నుంచి నగుమోము తారలే పాట లెెటస్ట్ గా రిలీజైంది. ఈ పాట ప్రారంభంలో నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా అని పూజా హెగ్డే అడగగా, నేనా టైప్ కాదు అని ప్రభాస్ చెబుతారు. కానీ నేను జూలియట్ నే, నన్ను ప్రేమిస్తే చచ్చిపోతావ్ అంటూ పూజా టీజ్ చేస్తుంది. ఇలా ప్రారంభమయ్యే నగుమోము పాటను ప్రేమతో నింపేసి తెరకెక్కించారు. ప్రభాస్ పూజా కోసం బైక్ పై వేచి చూడటం, వెనక రైన్ ఎఫెక్ట్ లు..పూజా ప్రభాస్ లవ్ ను యాక్సెప్ట్ చేసి బైక్ పై కూర్చొని రైడ్ కు వెళ్లడం..ఇవన్నీ ఒక అందమైన ప్రేమ జంట వాళ్ల రిలేషన్ ను ఎంజాయ్ చేయడాన్ని చూపిస్తాయి.

జస్టిన్ ప్రభాకర్ సంగీతాన్ని అందించిన ఆ పాటను కృష్ణకాంత్ రాయగా..సిధ్ శ్రీరామ్ పాడారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ పాట వస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ ఫిల్మ్ కాబట్టి, అప్పటి కాస్ట్యూమ్స్, స్టైల్ లో ప్రభాస్, పూజా కనిపించి ఆకట్టుకుంటున్నారు.

Related Posts