రోలెక్స్ తో పూజాహెగ్డే రొమాన్స్

బాలీవుడ్ ఆశలు కూలిపోవడంతో సౌత్ లోనే సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది పూజాహెగ్డే. ఇప్పటి వరకూ తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసిన ఈ జిగేల్ రాణి.. రీసెంట్ గా తమిళ్ లో బీస్ట్ తో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ డిజాస్టర్ కావడంతో ఇక తనకు తమిళ తంబిలు ఆఫర్స్ ఇవ్వరేమో అనుకుంది. బట్.. కాస్త లేట్ అయినా ఓ క్రేజీ స్టార్ తో రొమాన్స్ కు ఛాన్స్ వచ్చింది. ఐదు నిమిషాలు కనిపించినా రోలెక్స్ బ్రాండ్ లా కాస్ట్ లీ ఇంపాక్ట్ చూపించే స్టార్ తో మళ్లీ కోలీవుడ్ లో తన లక్ చెక్ చేసుకుంటోందీ బుట్టబొమ్మ. మినీ మూవీస్ తో మొదలుపెట్టి మెగా హీరోస్ వరకూ వచ్చిన బ్యూటీ పూజాహెగ్డే. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగుతోన్న ఈ డస్కీ బ్యూటీకి ఎప్పటి నుంచో బాలీవుడ్ లో పాగా వేయాలని కోరిక. కానీ అది నెరవేరడం లేదు. అక్కడ చేసిన రెండు మూడు సినిమాలూ డిజాస్టర్స్ గా మిగిలాయి. అయినా ఆ కోరిక వదల్లేదు. హిందీలో ఇప్పుడు రెండు సినిమాలు చేస్తోంది. వీటితో పాటు తెలుగులో మహేష్‌, త్రివిక్రమ్ మూవీలో తనే హీరోయిన్. అలాగే విజయ్ దేవరకొండ సరసన జనగణమనలోనూ పూజాహెగ్డేనే తీసుకున్నారు. ఈ టైమ్ లో మరో భాషలో ఆఫర్ రావడం అంటే హ్యాపీ న్యూసే కదా..?
తమిళ్ లో తను చేసిన ఫస్ట్ మూవీ బీస్ట్. విజయ్ వంటి టాప్ హీరో సరసన ఛాన్స్ కాబట్టి అక్కడా జెండా పాతొచ్చు అనుకుంది. కానీ బీస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయినా ఆ మూవీలోని అరబిక్ సాంగ్ అదరగొట్టింది.

లేటెస్ట్ గా ఈ పాట యూ ట్యూబ్ లో 150మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. బీస్ట్ పోయింది కాబట్టి ఇప్పట్లో మరో తమిళ్ రాదేమో అనుకున్నారు చాలామంది. బట్ లేటెస్ట్ గా ఓ క్రేజీ ఆఫర్ పట్టేసిందనే వార్తలు వస్తున్నాయి. అది కూడా సూర్య సరసన. యస్.. సూర్య వరుస సినిమాలతో దూకుడుగా ఉన్నాడు. కోలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా తిరుగులేని పేరు తెచ్చుకున్న శివ డైరెక్షన్ లో సూర్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీలోనే పూజాహెగ్డేను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారంటున్నారు.సూర్యకు తెలుగులోనూ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయినా కొన్నాళ్లుగా తెలుగు మార్కెట్ ను లాస్ అవుతున్నాడు. ఇటు పూజాకు తెలుగులో క్రేజ్ ఉంది కదా.. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకున్నట్టు ఉంటుంది.. అలాగే కాంబినేషన్ కొత్తగా ఉంటుందనే తనను తీసుకున్నారు అనేది కోలీవుడ్ మీడియా చెబుతోన్న మాట. ఆ మాటలు ఎలా ఉన్నా.. సూర్య సరసన ఆఫర్ అంటే పూజాహెగ్డేకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. విజయ్ తో పోలిస్తే సూర్య మార్కెట్ పెద్దది. సూర్య ఫ్యాన్ బేస్ కూడా ఇతర భాషల్లో ఎక్కువే. ఆ ప్లస్ పాయింట్ పూజా రేంజ్ పెరగడానికీ హెల్ప్ అవుతుంది. మరి ఈ సారైనా ఓ మంచి హిట్ కొడుతుందా లేదా అనేది చూడాలి.

Related Posts