ad

సినిమా డైలాగ్ లోనే కాదు.. బయట కూడా సింగిల్ పీస్ అనిపించుకున్న. డిఫరెంట్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ ఒక్కో సినిమాతో అద్భుతమైన నటన చూపిస్తూ దూసుకుపోతోంది. గ్లామర్ కు దూరంగా కథలకు దగ్గరగా జర్నీ చేస్తోన్న తెలుగు, తమిళ్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. రీసెంట్ గా విరాటపర్వంతో మరోసారి నట విశ్వరూపం చూపించిన సాయి పల్లవి.. ఇప్పుడు గార్గి గా వస్తోంది. తెలుగులో రానా దగ్గుబాటి ప్రెజెంట్ చేస్తోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.రంగుల ప్రపంచంలో గ్లామర్ కు దూరంగా ఓ హీరోయిన్ జర్నీ చేయడం అంత సులువు కాదు. అది ఈజీ కావాలంటే తను గొప్ప నటి అయి ఉండాలి. తను గ్రేట్ యాక్ట్రెస్ నే అని ఫస్ట్ మూవీ నుంచే ప్రూవ్ చేసుకున్న సాయి పల్లవి చాలా త్వరగానే తెలుగు ఆడియన్స్ హార్ట్స్ లో చోటు సంపాదించుకుంది. తన నటన, డ్యాన్స్ కు మనవాళ్లు ఎప్పుడో ఫిదా అయిపోయారు. అప్పుడప్పుడూ తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోన్న సాయి పల్లవి ఇప్పుడు గార్గి సినిమాతో వస్తోంది.

ప్రధానంగా ఇది తమిళ్ సినిమా. తెలుగులో డబ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన ఈ ట్రైలర్ చూస్తే సాయి పల్లవి మరోసారి స్ట్రాంగ్ కంటెంట్ తోనే వస్తున్నట్టు తెలుస్తోంది. స్కూల్ టీచర్ పాత్రలో కనిపిస్తోంది తను. తన తండ్రిని సడెన్ గా పోలీస్ లు పెద్ద నేరం మోపి అరెస్ట్ చేస్తే అతన్ని విడిపించుకోవడానికి ఓ సాధారణ అమ్మాయిగా తను ఎలాంటి ఫైట్ చేసిందనే కంటెంట్ ఈ మూవీ ఉండబోతోందని అర్థమౌతోంది.కొన్ని కథలు కొందరే చేయాలి. ఆ కొందరిలో సాయి పల్లవి ఖచ్చితంగా ఉంటుంది. అందుకే తెలుగు వారికి టైటిల్ కనెక్ట్ కాపోయినా ఈ ట్రైలర్ కనెక్ట్ అయింది. కారణం సాయి పల్లవే. నార్మల్ లుక్ తో కనిపిస్తోన్న తను మరోసారి అద్భుతమైన నటన చూపించబోతోందని ఈ ట్రైలర్ తోనే తెలుస్తోంది. గౌతమ్ రామచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. సాయి పల్లవితో పాటు కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి ఇతర కీలక పాత్రల్లో నటించారు. డబ్బింగ్ సినిమా అయినా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. కాకపోతే తను తప్ప మరో ఆర్టిస్ట్ తెలుగు ప్రేక్షకులకు తెలియదు. మరి ఎంత బలమైన కథైనా గార్గి తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

, , , , , ,