ప్చ్.. సమంత బ్యాడ్ లక్ ..

ఏ హీరోయిన్ కైనా ఓ స్టార్ హీరో సరసన ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తుంది. ఈ హీరోయిన్ పెద్ద స్టార్. అయినా తనకు ఇప్పుడు అర్జెంట్ గా పెద్ద స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు కావాలి. అందుకు ఓ కారణం ఉంది.. అది అందరికీ తెలుసు. తను కోరుకుంటున్నట్టుగానే ఓ బిగ్ స్టార్ తో ఛాన్స్ వచ్చింది. పైగా ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్ లో బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. అయినా తను ఈ ఆఫర్ ను అందుకోలేకపోతోందట. దీనికి కారణం రొటీన్ గానే ఉన్నా.. ఆ స్టార్ హీరోయిన్ మాత్రం సమంత. మరి హీరో ఎవరనే కదా మీ డౌట్..
సమంత.. పర్సనల్ లైఫ్‌ డిస్ట్రబెన్స్ తర్వాత మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేసింది. వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. అయితే ఇవన్నీ తన సోలో సినిమాలు. బట్ తను మళ్లీ రెగ్యులర్ హీరోయిన్ టైప్ సినిమాలతో బిజీ కావాలనుకుంటోంది. అది జరగాలంటే మళ్లీ ఓ స్టార్ హీరోతో సినిమా చేసి హిట్ కొడితే తప్ప కుదరదు. సోలోగా ఎన్ని విజయాలు అందుకున్నా.. తను కోరుకునే ఇమేజ్ మళ్లీ రాదు. ప్రస్తుతం శామ్ నటించిన యశోద, శాకుంతలం సినిమాలు విడుదల కు సిద్ధంగా ఉన్నాయి. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేయబోతోంది. అలాగే తాప్సీ నిర్మించే సినిమాలో తనే మెయిన్ లీడ్. ఇటు రీసెంట్ గా మళయాలంలో దుల్కర్ సాల్మన్ సరసన ఛాన్స్ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. బట్ ఇవేవీ తనకు రెగ్యులర్ హీరోయిన్ టైప్ ఇమేజ్ తేలేవు. హీరోయిన్ గా సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనే అనుకుంటున్నారంతా. అలాగే ఇప్పుడు సీనియర్ హీరోయిన్ల కొరత కూడ ఉంది కాబట్టి శామ్ కు ఛాన్స్ లు పెరుగుతాయి. ఈ క్రమంలో లేటెస్ట్ తనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ఛాన్స్ వచ్చింది. అంటే తను కోరుకుంటోన్న ఆఫర్ ఇది. బట్ తను చేయలేకపోతోందట. అందుకు కారణం ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు. వాటివల్ల ఈ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతోందంటున్నారు. నిజానికి ఇప్పుడు ఎన్టీఆర్ తో నటించడం లక్కీ ఛాన్స్. అయితే అంతా అనుకున్నట్టుగా ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా ఆగస్ట్ లో స్టార్ట్ కావడం లేదు. నవంబర్ కు వెళుతుంది అంటున్నారు. మరి ఆ లోగా శామ్ డేట్స్ అడ్జెస్ట్ అయితే నటిస్తుందేమో కానీ ఇప్పటికిప్పుడు అయితే కష్టమే అంటున్నారు. ఏదైనా బ్యాడ్ లక్ అంటే ఇదే కదా..

Related Posts