అఫీషియల్.. సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చి పాలిటిక్స్ తో ఫుల్ బిజీ అయిపోయాడు. పవన్ కిట్టీలో ‘ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు‘ చిత్రాలున్నాయి. వీటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకొచ్చే సినిమాపై లేటెస్ట్ గా క్లారిటీ వచ్చేసింది. ‘సాహో‘ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘ఓజీ‘ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా.. ‘ఓజీ‘ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. వింటేజ్ లుక్ లో ఓ కారు పక్కన నిలబడ్డ పవర్ స్టార్ చేతిలో గాజు గ్లాస్ తో టీ తాగుతున్న ఈ పోస్టర్ ఇంప్రెస్సివ్ గా ఉంది.

సెప్టెంబర్ 27కి ఓ స్పెషలిటీ ఉంది. అదే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘అత్తారింటికి దారేది‘ విడుదలైన తేదీ. ‘అత్తారింటికి దారేది’ 2013, సెప్టెంబర్ 27న విడుదలైంది. సినిమా థియేటర్లలోకి వచ్చే ముందే ఆన్ లైన్లో లీకైనా.. ‘అత్తారింటికి దారేది’ని ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చేశారు అభిమానులు. మరి.. ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ సెంటిమెంట్ తో రాబోతున్న ‘ఓజీ‘ కూడా మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందేమో చూడాలి. మరోవైపు.. త్వరలోనే ‘ఓజీ‘ షూట్ ను రీస్టార్ట్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది టీమ్.

Related Posts