పక్క చూపులు చూస్తోన్న పవన్ దర్శకులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. దీంతో.. ప్రొడక్షన్ లో ఉన్న ‘హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ‘ సస్పెన్స్ లో పడ్డాయి. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాలు మళ్లీ తిరిగి ఎప్పుడు పట్టాలెక్కుతాయనేది పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుపైనే ఆధారపడి ఉంది.

ఈనేపథ్యంలో.. ఇప్పుడు పవన్ డైరెక్టర్స్ పక్క చూపులు చూస్తున్నారు. పవర్ స్టార్ తో తాము చేస్తోన్న మూవీస్ ను పక్కనపెట్టి.. మరో ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నారు. వీరిలో హరీష్ శంకర్.. రవితేజాతో ‘మిస్టర్ బచ్చన్‘ మొదలుపెట్టాడు. బాలీవుడ్ మూవీ ‘రెయిడ్‘ రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రం శరవేగంగా పూర్తవుతోంది. ఇక.. విలక్షణ దర్శకుడు క్రిష్ కోవిడ్ టైములోనే ‘హరిహర వీరమల్లు‘ నుంచి గ్యాప్ రావడంతో ‘కొండపొలం‘ సినిమా చేశాడు. ఇప్పుడు మరో చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు. లేటెస్ట్ గా సుజీత్ కూడా ‘ఓజీ‘ నుంచి గ్యాప్ రావడంతో.. అదే నిర్మాణ సంస్థ డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ లో నానితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నాని-సుజీత్ కాంబో మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందట.

Related Posts