‘సలార్, యానిమల్‘ కోసం నెట్ ఫ్లిక్స్ నయా స్ట్రాటజీ

రూరల్ మూవీస్ ను సైతం.. గ్లోబల్ వేదికపై నిలబెడుతున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. ఒక భాషలో విడుదలైన చిత్రాన్ని పలు భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తూ.. వాటి రీచ్ ను భారీ స్థాయిలో పెంచుతున్నాయి. ఈకోవలోనే.. ఓటీటీ జయంట్ నెట్ ఫ్లిక్స్ ఇండియన్ మూవీస్ కి ఇంగ్లీష్ వెర్షన్స్ రెడీ చేస్తోంది.

కంటెంట్ లోనే కాదు.. కమర్షియల్ ఎలిమెంట్స్ లోనూ ఇండియన్ మూవీస్.. హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోవని ‘బాహుబలి‘ సిరీస్ నిరూపించింది. ఆ తర్వాత చాలా సినిమాలు ఇదే బాటలో వచ్చాయి. లేటెస్ట్ గా ‘సలార్‘ పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్టయ్యింది. ఆమధ్య ‘సలార్‘ను ఇండియన్ లాంగ్వేజెస్ లో విడుదల చేసిన నెట్ ఫ్లిక్స్.. ఇటీవల ఇంగ్లీష్ వెర్షన్ లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది.

‘సలార్‘తో పాటు లేటెస్ట్ గా ‘యానిమల్‘కి సైతం ఇంగ్లీష్ వెర్షన్ రెడీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ నెట్ ఫ్లిక్స్ ఉంది. దీంతో.. ఇండియన్ మూవీస్ కి ఇంగ్లీష్ వెర్షన్స్ రెడీ చేసి.. అన్ని దేశాల్లోనూ అందుబాటులోకి తెచ్చేలా ఈ నయా ప్లాన్ వేసింది నెట్ ఫ్లిక్స్. ఈ స్ట్రాటజీ మన మూవీస్ కి బాగా కలిసొచ్చే అంశమే. ఇప్పటివరకూ పాన్ ఇండియా లెవెల్ లోనే సత్తా చాటుతోన్న మన చిత్రాలు.. ఓటీటీ పుణ్యమా అని.. అన్ని దేశాల్లోనూ సందడి చేసే అవకాశం లభించింది.

Related Posts