HomeLatestJr Ntr :ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే..

Jr Ntr :ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే..

-

టాలీవుడ్స్ మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్ అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ దే అని చెప్పాలి. వీరి కాంబినేషన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని టాలీవుడ్ మాత్రమే కాదు.. కంట్రీ మొత్తం ఎదురుచూస్తోందంటే అతిశయోక్తి కాదు. అయితే ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే వస్తోంది అనౌన్స్‌ మెంట్. బట్ లేటెస్ట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వీరి కలయికలో వచ్చే సినిమాపై ఓ క్లియర్ అప్డేట్ వచ్చింది.


ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెబుతూ 2024 మార్చి నుంచి ఈ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవుతుదని చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో దేవర మూవీ చేస్తున్నాడు.

అటు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ తో సలార్ మూవీతో బిజీగా ఉన్నాడు. సలార్ ఈ యేడాది సెప్టెంబర్ 28న విడుదలవుతుంది.

ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాడు ప్రశాంత్. ఆలోగా ఎన్టీఆర్ దేవరకు సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఉంటాడు. అలా మార్చి నుంచి వీరి సినిమా స్టార్ట్ అవుతుందన్నమాట.

మొత్తంగా బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ కరెంట్ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రావడం..ఇటు మోస్ట్ అవెయిటెడ్ మూవీకి సంబంధించి కీలకమైన అప్డేట్ కూడా రావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారనే చెప్పాలి.

ఇవీ చదవండి

English News