లవర్ బాయ్ పై బాలీవుడ్ ఆశలు

లవర్ బాయ్  బాలీవుడ్ బాధలు తగ్గడం లేదు. సాలిడ్ బ్లాక్ బస్టర్ అనే మాట విని చాలాకాలం అయింది అక్కడ. ఆ మధ్య వచ్చిన భూల్ బులాయా2 సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆతర్వాత మళ్లీ హిట్ అనే మాటే లేదు. దీంతో నెక్ట్స్ వీక్ రాబోతోన్న షంషేరా పై బాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. చాక్లెట్ బాయ్ ఇమేజ్ దాటే ప్రయత్నంలో ఉన్న రణ్‌బీర్ కపూర్ నుంచి వస్తోన్న ఈ మూవీ బాలీవుడ్ కలలను నెరవేరుస్తుందా..?బాలీవుడ్ కు అర్జెంట్ గా ఓ బ్లాక్ బస్టర్ కావాలి. చాలాకాలంగా సాలిడ్ హిట్ లేక సత్తా చూపలేకపోతోంది బాలీవుడ్. దీంతో ఇప్పుడు ఇండియన్ మూవీ అంటే సౌత్ సినిమానే అన్న మాట ఫిక్స్ అయిపోయింది. ఒకప్పుడు మన సినిమాలను పట్టించుకోని ఖాన్, కపూర్ లు కూడా ఇప్పుడు మన సినిమా అంటే భయపడుతున్నారు. ఆ భయం పోగొట్టే సినిమాల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వస్తోన్న షంషేరా ఆ వెయిటింగ్స్ కు ఫుల్ స్టాప్ పెడుతుందనుకుంటున్నారు.

రణ్‌బీర్ కపూర్, వాణి కపూర్ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కాబోతోంది. స్వాంతంత్ర్యానికి పూర్వం జరిగిన కథగా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. అందుకే ప్యాన్ ఇండియన్ లెవల్లో విడుదల చేస్తున్నారు.కరణ్‌ మల్హోత్రా డైరెక్షన్ లో ఆదిత్య చోప్రా నిర్మించిన సినిమా షంషేరా. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. స్వాతంత్ర్యానికి పూర్వం వినిపించిన థగ్ లు.. వారి వారసత్వానికి సంబంధించిన కంటెంట్ లా కనిపిస్తోందీ మూవీ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా చెబుతోన్న ఈ మూవీతో రణ్ బీర్ కపూర్ కూడా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడని చెప్పొచ్చు. రణ్ బీర్ తండ్రి, కొడుకులుగా రెండు పాత్రలు చేశాడు. వీరిలో తండ్రిని అంతం చేసి తనయుడి వరకూ కొనసాగే బ్రిటీష్ వారి అధిక