ఒక్క భారీ హిట్ లేదు అప్పుడే ప్యాన్ ఇండియానా..?

ఒకప్పుడు సౌత్ సినిమాలు బాలీవుడ్ లో ఒకటీ అరా విజయం సాధిస్తేనే అబ్బో అనుకున్నారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ మొత్తం సౌత్ సినిమాల కోసం చూస్తోంది అందుకు కారణం బాహుబలి, కెజీఎఫ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగని ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడితే ప్యాన్ ఇండియా అంటున్నారు. అసలు ప్యాన్ ఇండియన్ మూవీ అనే పదం చాలా చిన్నదైపోయిందిప్పుడు. ఎంత చిన్నదంటే తెలుగులోనే పూర్తి ఆడియన్సెస్ తెలియని హీరోలు కూడా ప్యాన్ ఇండియన్ అనేస్తున్నారు. అలాగని వీరిని తక్కువ చేయడం కాదు. బట్ అది వారికి వారి కంటెంట్ పై ఉన్ననమ్మకమే అనుకోవచ్చు. తెలుగులో బాల నటుడుగా ఆకట్టుకుని ఈ మధ్యే హీరోగా మారిన తేజ సజ్జా కూడా ఇప్పుడు ప్యాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ కాబోతున్నాడట.
హీరోగా తొలి సినిమా జాంబిరెడ్డి. అంతకు ముందు తన అడల్ట్ లుక్ తో ఓ బేబీలో కనిపించాడు. అయితే జాంబిరెడ్డి ఆకట్టుకుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా బాగా వర్కవుట్ అయింది. ఆ తర్వాత చేసిన ఇష్క్, అద్భుతం ఎవరినీ మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం తేజ ‘హాను మాన్’ అనే మూవీతో వస్తున్నాడు. ఈ చిత్రానికీ జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మే దర్శకుడు. మొదట సాధారణంగా మొదలైనా.. కంటెంట్ యూనివర్సల్ అనుకున్నారో ఏమో కానీ.. లేటెస్ట్ గా తమ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
నిజానికి ఇప్పుడు దేశంలో మతాలకు సంబంధించిన వ్యవహారాలు బాగా అమ్ముడవుతున్నాయి. అవి సినిమాలైనా వార్తలైనా.. ఇక సినిమా అంటే చెప్పేదేముందీ.. దీనికి ప్రాంతంతో పని ఉండదు. ఆ కంటెంట్ సదరు వ్యక్తులను హర్ట్ చేయకుండా ఉంటే చాలు.. ఆటో మేటిక్ గా ఆకట్టుకుంటుంది. ఆ ధైర్యంతోనే వీళ్లు హనుమాన్ ను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు అనుకోవచ్చు.
విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి నిర్మాత కూడా ప్రశాంత్ వర్మే. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యేడాదే విడుదల కాబోతోన్న ఈ హనుమాన్ బాక్సాఫీస్ ను భారీ డబ్బులతో లిఫ్ట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

Related Posts