రేర్ రికార్డ్ సాధించిన నయనతార

ఒక హీరోయిన్ కెపాసిటీని నిర్ణయించేది ఏంటీ అంటే వెంటనే రెమ్యూనరేషన్ అని చెప్పేస్తారు. కానీ రెమ్యూనరేషన్ తో పాటు తనే ప్రధాన పాత్రలో నటించి తెచ్చుకున్ను ఓపెనింగ్స్ కూడా అని ప్రూవ్ చేసింది నయనతార. కెరీర్ సాఫీగానే ఉన్నా.. పర్సనల్ లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న నయన్ కెపాసిటీకి ఇప్పుడు ఎంటైర్ సౌత్ ఔరా అంటోంది. ఓవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే రెగ్యులర్ మూవీస్ లోనూ యాక్ట్ చేస్తోన్న నయన్ రెమ్యూనరేషన్ విని ఇప్పుడు అంతా నోరెళ్లబెడుతున్నారు. మరి తన రెమ్యూనరేషన్ ఏంటో తెలుసా..?చాలా చిన్న సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టింది నయనతార. దాదాపు 15యేళ్ల కెరీర్. 75వ సినిమా వరకూ వచ్చిందిప్పుడు. ఈ క్రమంలో తన జర్నీ 45- 50 సినిమాల మధ్య నుంచి కొత్త టర్న్ తీసుకుంది. హీరోయిన్ ఓరియంటెడ్ కథలతో ఆకట్టుకుంది. బలమైన కథలు ఎంచుకుంటూ కమర్షియల్ గానూ సక్సెస్ లు కొట్టింది. ఏకంగా ఓ మీడియం రేంజ్ హీరోకు ఉన్నంత మార్కెట్, ఎపెనింగ్స్ నయన్ సాధించింది. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఇది చిన్న విషయం కాదు.

ఈ విషయంలో ఆమె కెపాసిటీకి ఫిదా కావాల్సిందే. అందుకే తన కోసం సూపర్ హీరోలు కూడా డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటున్నారు. ఇక రీసెంట్ గా విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న నయన్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది.సౌత్ లో సత్తా చాటిన నయనతార రీసెంట్ గా బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్ ఖాన్ సరసన అట్లీ డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమాలో తనే హీరోయిన్. దీంతో పాటు లేటెస్ట్ గా ఓ తమిళ్ మూవీకి సైన్ చేసింది. ఈ చిత్రం కోసం తను 10కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. సౌత్ లో ఈ ఫిగర్ అంటే కళ్లు తిరిగిపోవాల్సిందే. బాలీవుడ్ లో కొందరు హీరోయిన్లకు ఈ రేంజ్ ఉంది. కానీ ఇక్కడ ఇందులో సగం కూడా టాప్ హీరోయిన్లకు లేదు. అయినా నయన్ కు ఇస్తున్నారంటే.. తన కెపాసిటీకి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుందీ..? ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుస్తాయి. మరోవైపు తెలుగులో నయనతార, చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ లోనూ నటించింది. ఇది చిన్న పాత్రే అయినా పారితోషికం పెద్దదే. మొత్తంగా పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తానని చెప్పకనే చెబుతూ.. ఆ డిమాండ్ ను మరింత పెంచుకోవడం నయన్ కే చెల్లింది.

Related Posts