తెలుగు సినిమాకు జాతీయ అవార్డుల పంట

2020యేడాదికి గానూ కేంద్రం 68వ జాతీయ అవార్డులను ప్రకటించింది. గత కొన్నేళ్లుగా జాతీయ అవార్డుల్లో సత్తా చాటుతోన్న తెలుగు సినిమా ఈ సారి మరిన్ని ఎక్కువ అవార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అల వైకుంఠపురములో చిత్రానికి ఎస్ఎస్ తమన్ సెలెక్ట్ అయ్యాడు. అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రంలోని పాటలు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. వాల్డ్ వైడ్ గానూ ఎంతోమంది సెలబ్రిటీస్ ఈ పాటలకు స్టెప్పులు వేసి అదరగొట్టారు. దీంతో దేశాన్ని ఊపేసిన పాటలతో తమన్ నేషనల్ అవార్డ్ అందుకున్నాడు.
బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ మేకప్ విభాగాల్లో సంధ్యారాజు నటించిన ”నాట్యం” చిత్రం అవార్డ్ సాధించింది. సంధ్యారాజు ఈ చిత్రం కోసం ఎంతో శ్రమించారు.

దర్శకుడు రేవంత్ కోరుకొండ సైతం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని చెప్పాడు. తెలుగులో కమర్షియల్ గా సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. వీరి కష్టానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం విశేషం.ఇక బెస్ట్ రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో కలర్ ఫోటో నేషనల్ అవార్డ్ సాధించింది. సందీప్ రాజ్ డైరెక్షన్ లో సుహాస్, చాందిని చౌదరి జంటగా సునిల్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి అప్పట్లోనే విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. కలర్ డిస్క్రిమినేషనల్ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా వచ్చిన కలర్ ఫోటో కరోనా కాలంలో రావడంతో ఆశించినంత ఆదరణ లభించలేదు. సుహాస్, చాందిని మధ్య కెమిస్ట్రీకి చాలామంది ఫిదా అయ్యారు. ఇక సునిల్ విలనీ కూడా చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితేనేం అందరూ కలలు కనే అవార్డ్ సొంతం చేసుకుంది. మొత్తంగా నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటిన విజేతలందరికీ తెలుగు 70ఎమ్.ఎమ్ శుభాకాంక్షలు చెబుతోంది.

Related Posts