సినీ ఇండ‌స్ట్రీకి అన్నీ మంచి రోజులే అంటున్న నాగార్జున‌

టాలీవుడ్ కింగ్ నాగార్జున‌, యువ స‌మ్రాట్ నాగ‌చైత‌న్య‌ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం బంగార్రాజు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించిన బంగార్రాజు చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుని స‌క్స‌స్ ఫుల్ గా రన్ అవుతుంది. రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతున్న బంగార్రాజు నాగార్జున‌, నాగ‌చైత‌న్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సంద‌ర్భంగా బంగార్రాజు బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్స‌స్ పుర‌స్క‌రించుకుని రాజ‌మండ్రిలో బంగార్రాజు థ్యాంక్య్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ వేడుక‌లో నాగార్జున మాట్లాడుతూ… కరోనాతో ప్రపంచమంతా భయపడుతున్నా, సంక్రాంతికి రిలీజ్ అయిన బంగార్రాజు సినిమాను ఆదరించి సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికి నా పాదాభివందనాలు. ఇక ఇటీవల జరిగిన మెగాస్టార్‌ చిరంజీవి, సీఎం జగన్‌ల భేటీ గురించి తెలుసుకున్నాను. సినీ పరిశ్రమ పై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారని నా మిత్రుడు చిరంజీవి గారు నాతో చెప్పారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినీ పరిశ్రమకు ఇక అన్నీ మంచిరోజులేనని నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే వేదిక మీద‌ పీపుల్ స్టార్ ఆర్. నారాయ‌ణ‌మూర్తి కూడా మాట్లాడుతూ… బంగార్రాజు బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్స‌స్ సాధించింది. టీమ్ అంద‌రికీ అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నాను. సినీ ప‌రిశ్ర‌మ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కిరంచేందుకు సీఎం జ‌గ‌న్ గారు సానుకూలంగా స్పందించారు. నాగార్జున గారు చెప్పిన‌ట్టుగా ఇక నుంచి ఇండ‌స్ట్రీకి మంచి రోజులే అని అన్నారు.

Related Posts