ప్రభాస్.. ఇప్పుడీ పేరు ప్యాన్ ఇండియన్ లెవల్లో ఓ వైబ్రేషన్ లా మారింది. ఒక్క బాహుబలి ప్రభాస్ ను ఓవర్ నైట్ ఇండియాస్ టాప్ స్టార్ ను చేసింది. ఆ రేంజ్ ను మెయిన్టేన్ చేస్తూనే అతని తర్వాతి కథలు ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వరుసగా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ తో వస్తున్నాడు. ఇవన్నీ భారీ రేంజ్ సినిమాలే. అయితే.. రీసెంట్ గా ఆయన ఓ మిడ్ రేంజ్( తన రెమ్యూనరేషన్ లో కాదు) మూవీకి ఓకే చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఇప్పటి వరకూ తెలుగులో ఒక్క టాప్ స్టార్ తోనూ సినిమా చేయని మారుతి దర్శకత్వంలో మూవీ చేయడానికి ఒప్పుకున్నాడు ప్రభాస్. సినిమా పేరు రాజా డీలక్స్ అని ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ఒక భారీ సెట్ లో అత్యధిక భాగం చిత్రీకరణ జరుపుకోబోతోన్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఇచ్చిన డేట్స్ కూడా కేవలం రెండు నెలలు. ఈ రెండు నెలల్లోనే సినిమాను పూర్తి చేయబోతున్నారు. � |