బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో నాగచైతన్య – సమంత రూట్ లో వెళుతున్నాడా..?

నాగ చైతన్య బాలీవుడ్ ప్రయత్నాలు ముమ్మురం చేసినట్టు కనిపిస్తున్నాడు. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోనూ అడుగులు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మొదటగా ప్రోమోలా వస్తోన్న సినిమా లాల్ సింగ్ చడ్డా. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన ఈ చిత్రం హాలీవుడ్ లో వచ్చిన ఫారెస్ట్ గంప్ కు రీమేక్. కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుందీ చిత్రం. మరి మన ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది వాళ్లు చేసిన మార్పులను బట్టి ఉంటుంది. బట్ ఇప్పటికైతే ప్రామిసింగ్ గానే ఉంది. ఈ నెల 11న లాల్ సింగ్ చడ్డా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య ఓ ఇరవై నిమిషాల పాటు ఉండే పాత్ర చేశాడు. ఈ చిన్న పాత్రతోనే అతని బాలీవుడ్ సక్సెస్ ను డిసైడ్ చేయలేం.

ఈ మూవీ తర్వాత థ్యాంక్యూ దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్ లోనే దూత అనే వెబ్ సిరీస్ వస్తోంది. ఇది హిందీలోనే రూపొందుతోన్న సిరీస్. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ఉంటుంది. ఆ టైమ్ కు చైతూ కెపాసిటీ తెలుస్తుంది. అయితే ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో ఉన్న చైతూ ముంబైలోనే అక్కడి టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని కలిశాడు. ఇది మామూలు కలయికే అనుకున్నారు చాలామంది. బట్ వీరి మధ్య మూవీకి సంబంధించిన డిస్కషన్ జరిగిందంటున్నారు. సంజయ్, చైతూకి కథ చెప్పాడంటున్నారు. అందుకే దాదాపు గంటకు పైగా సమావేశం అయ్యారు.


మామూలుగా కలిస్తేనే ఏదేదో అనేస్తారు.అలాంటిది అంతసేపు మీటింగ్ జరిగిందంటే ఖచ్చితంగా సంజయ్ డైరెక్షన్ లో నాగ చైతన్య నటించబోతున్నాడు అనే కదా అర్థం అంటూ రకరకాల వార్తలు వస్తోన్న నేపథ్యంలో వీటిని ఎవరూ ఖండించడం లేదు. అలాగని నిజమే అనడం లేదు. అంటే మౌనం అర్థాంగీకారంగా భావించాలి. సో.. నాగ చైతన్య కూడా సమంత రూట్ లోనే బాలీవుడ్ లో అడుగులు పెడుతున్నాడు. మరి శామ్ లా సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి.

Related Posts