“పుష్ప‌” లో స‌మంత ఐటం సాంగ్ కు ముహూర్తం ఫిక్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌.
ఈ సినిమాలో స‌మంత ఓ ఐటం సాంగ్ చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ ఐటమ్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ స్పెషల్ నంబర్ లో బన్నీ – సామ్ స్టెప్పులు ప్రత్యేకంగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సాంగ్ కు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే.. పుష్ప మేకర్స్ సమంత చేస్తున్న సాంగ్ కి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. అల్లు అర్జున్, సమంత కలసి చేస్తున్న రాకింగ్ నంబర్ ను భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. త్వరలో ఈ సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ని చూడటానికి సిద్ధంగా ఉండండని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో సమంత ఫేస్ కనిపించనప్పటికీ.. నడుము మీద చెయ్యేసి వయ్యారాలు పోతున్న పోజ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ఐటమ్ సాంగ్ ఎలా ఉండ‌బోతుందో అనేది ఆస‌క్తిగా మారింది. అల్లు అర్జున్ సరసన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలో హీరోయిన్ గా నటించిన సామ్.. ఇప్పుడు పుష్ప లో స్పెషల్ సాంగ్ చేస్తుండ‌డం విశేషం.

Related Posts