మోహన్ బాబు.. చిరంజీవి గురించి చెప్పడా..?

అందరినీ రెస్పెక్ట్ కోసం వేధించే వ్యక్తి తనే రెస్పెక్ట్ కోల్పోయినట్టుగా ఉంది మోహన్ బాబు పరిస్థితి. మాట్లాడితే డిసిప్లిన్ అంటూ ఆ పదాన్నే అవహేళన చేసేలా ఈ మధ్య కొన్ని పబ్లిక్ ఫంక్షన్స్ లో బిహేవ్ చేస్తోన్న మోహన్ బాబు మాత్రం ఆ పదానికి తాను దూరం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా మర్యాద అంటే ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంటుంది. కానీ ఈ డైలాగ్ కింగ్ కు పుచ్చుకోవడమే కానీ.. ఇచ్చుకోవడం లేదు అనిపిస్తోంది. ఇవన్నీ ఎందుకంటే.. ఇప్పుడు ఈ ఒకప్పటి కలెక్షన్ కింగ్ నటించిన సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా వచ్చింది కదా..? నిజానికి ఈ చిత్రాన్ని ఆయన ఫ్యామిలీ తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు అనేది ఓపెన్ సీక్రెట్. అలాగని నటుడుగా మోహన్ బాబును ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయలేం. ఓ రేంజ్ యాక్టర్ అనేది అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఈ నటుడికి మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు.
ఎంత పెద్ద రాజకీయాల్లో అయినా అవి పాలిటిక్స్ వరకే ఉంటాయి. వ్యక్తిగతంగా ద్వేషాలుండవు అని ముఖ్యమంత్రి కెసీఆర్ బర్త్ డేకు గ్రీటింగ్స్ చెప్పిన వారి లిస్ట్ చూస్తే తెలుస్తుంది. కానీ మోహన్ బాబు మాత్రం తన సన్ ఆఫ్ ఇండియా సినిమాకు మెగాస్టార్ తో వాయిస్ ఓవర్ చెప్పించుకున్నాడు. నిజానికి అప్పట్లో విడుదల చేసిన టీజర్ కూడా చిరు వాయిస్ వల్లే కాస్త ఎక్కువ రీచ్ అయిందనేది నిజం. తర్వాత మా ఎన్నికల మేటర్ లో కాస్త భేదాలు వచ్చాయి. తర్వాత జగన్ ను కలిసే విషయంలో కూడా అటు మంచు విష్ణు కూడా స్థాయిని మరచి కమెంట్స్ చేశాడు. సరే ఇవన్నీ ‘మా’ పాలిటిక్స్ అనుకుందాం. కనీసం తనకు వాయిస్ ఓవర్ చెప్పిన చిరంజీవికి కనీసం విడుదలకు ముందు చిన్న థ్యాంక్స్ అయినా చెప్పాలి కదా..? లేదు. కేవలం దర్శకుడు మాత్రమే చిరంజీవి గారికి థ్యాంక్స్ అంటున్నాడు తప్ప.. ఈయన మాత్రం ఆ మాటే ఎత్తడం లేదు. ఏదైనా ఎదుటివాడికి చెప్పేందుకే నీతులున్నాయని.. ఊరికే అనలేదు కదా.. ? మళ్లీ ఈయనగారు.. సంస్కారం అంటూ బేస్ వాయిస్ లో అనేస్తాడు అని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Related Posts