మెగా అల్లుడి అలక… ఇంత‌కీ ఏమైంది.?

మెగా ప్యామిలీకి దూరంగా క‌ళ్యాణ్ అన‌గానే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనుకుంటే పొర‌పాటే. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతో హీరోగా సక్సెస్ ఫుల్ గా లాంచ్ కాలేదనే చెప్పాలి. అప్పటి నుంచి సినిమాల విషయంలో ఆచితూచి ముందుకు వెళ్తున్న కళ్యాణ్.. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. రాబోయే మూడు సినిమాలతో కళ్యాణ్ దేవ్ కెరీర్ గాడిలో పడుతుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇప్పుడు యువ హీరో మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారనే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతే కాకుండా.. దీనికి కారణం రామ్ చరణ్ అని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీ అంతా కలిసి జరుపుకున్న వేడుకలలో అల్లుడు కళ్యాణ్ దేవ్ ఎక్కడా కనిపించలేదు. దీనికి తోడు శ్రీజ గత కొన్ని నెలలుగా తన ఇన్స్టాగ్రామ్ లో భర్త కళ్యాణ్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయలేదు. దీంతో భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని.. అందుకే మెగా ఫ్యామిలీకి దేవ్ దూరంగా ఉంటున్నారని ఆ మధ్య ఊహాగానాలు వినిపించాయి.

ఇలా వార్త‌లు ఎక్కువ రావ‌డం.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల గురించి కొంత మంది ఆరా తీస్తుండ‌డంతో ఓసారి మేమిద్ద‌రం క‌లిసే ఉన్నామ‌నే అర్ధం వ‌చ్చేలా ఓ ఫోటోను సోష‌ల్ మీడియాలో క‌ళ్యాణ్ దేవ్, శ్రీజ‌ పోస్ట్ చేయ‌డం జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ ఈ వార్త‌లు ఆగ‌డం లేదు. ఇది నిజ‌మే అని గ‌ట్టిగా వార్త‌లు షికారు చేస్తున్నాయి. దీంతో మెగా అభిమానుల్లో కంగారు మొద‌ల‌య్యింది. రోజురోజుకు ఈ వార్త‌లు ఎక్కువు అవుతున్నాయి. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై త్వ‌ర‌లో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Related Posts