సెలబ్రిటీలు.. బ్లాక్ ఫిల్మ్ లూ.. అలా చేస్తే పోలీస్ లు ఆపగలరా..?

ఒక ఇన్సిడెంట్ వేల మార్పులకు కారణం అవుతుంది అంటారు. కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ దారుణం తర్వాత ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ లు ఉంచకూడదు అనే కొత్త రూల్ తెచ్చారు. రూల్స్ ఉన్నది మన మంచికే అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు అది మంచి నుంచి మరోవైపు కు దారితీస్తుంది. నిజానికి ఆ ఇన్సిడెంట్ తర్వాత బ్లాక్ ఫిల్మ్స్ తొలగించారు. మరి అలాంటి సంఘటనలు పునరావృతం కాలేదా అంటే ఆన్సర్ అందరికీ తెలుసు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇప్పుడు హైదరాబాద్ లో కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్స్ ను తొలగించే కార్యక్రమాన్ని పోలీస్ లు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీస్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేస్తూ.. కనిపించిన అందరి కార్లకూ ఫైన్ వేస్తున్నారు. అయితే ఇక్కడ ఓ ప్రాథమిక అంశాన్ని పోలీస్ లు విస్మరిస్తున్నారు.


నిజంగా సెలబ్రిటీస్ అంతా బ్లాక్ ఫిల్మ్స్ తొలగించి క్లియర్ గ్లాస్ తో రోడ్లపైకి వచ్చి కనిపిస్తే పబ్లిక్ ఆగుతారా..? ఆ వాహనాల వెంట పడి మరీ వేధిస్తారు. అది కాస్తా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కు దారి తీస్తుంది. కొన్నాళ్ల క్రితం రామ్ చరణ్ కార్ వెనక ఇద్దరు కుర్రాళ్లు పడితే.. చరణ్ సీరియస్ అయ్యాడు. అప్పట్లో చరణ్ ఇంత పెద్ద స్టార్ కాకపోయినా మెగాస్టార్ తనయుడుగా వాళ్లు కాస్త ఇబ్బంది పెట్టారు. ఆ టైమ్ లో అది ఎంత పెద్ద ఇష్యూ అయిందో అందరికీ తెలుసు. ఇకపై ఇలా ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరో ఏ త్రివిక్రమో.. లేక ఎన్టీఆరో లేక మరో స్టారో కనిపిస్తే.. ఇక సిగ్నల్ ను పట్టించుకునేంత వివేకం మనవారిలో ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఎవరికి వారు వారిని కలిసేందుకు వెంటపడతారు. అదీ ఇతర వాహనదారులకు ఇబ్బందే. ఇలాంటివి కూడా పోలీస్ లు ఆలోచించుకుని.. ఫిల్మ్ లు తొలగించడం.. ఫైన్లు వేయడం అనే కాన్సెప్ట్ ను దాటి ఇంకేదైనా కొత్త ప్లాన్ చేస్తే బెటర్.


ఏదేమైనా ఆ మధ్య మంచు మనోజ్ కార్ కు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి ఫైన్ వేశారు. ఆ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లేటెస్ట్ గా త్రివిక్రమ్ కార్ కు ఉన్న ఫిల్మ్ నూ తొలగించి ఫైన్ వేశారు. మరి రేపెవరో.. ?

Related Posts