ఆరంభంలో అక్క.. ఆఖర్లో చెల్లి.. అదరగొట్టారు ..

ఈ యేడాది ప్రపంచం అనేక కొత్త పాఠాలు నేర్చుకుంది. ఏదీ మన చేతుల్లో ఉండదు.. ఉండకూడదు అనే సత్యాన్ని సైతం ఆవిష్కరించింది. ఇక సినిమా రంగానికి సంబంధించి ఇది మిక్స్ డ్ ఇయర్. విశేషం ఏంటంటే.. అంతా బావున్నప్పుడు ఎన్ని విజయాలు ఉంటాయో.. ఏమీ బాలేని ఈ యేడాది కూడా అంతే విజయాలు వచ్చాయి. సినిమాల పరంగా హిట్స్ ఫ్లాపుల గురించి అందరికీ తెలుసు. అయితే ఏ యేడాదైనా సినిమాల పరంగా కొన్ని ప్రత్యేకమైన అంశాలుంటాయి. అలాంటి వాటిలో ఐటమ్ సాంగ్ ఒకటి. యస్.. ఒక్కోసారి ఐటమ్ సాంగ్స్ యేడాదంతా.. ఆ మాటకొస్తే రెండు మూడేళ్ల పాటు అన్ని ఫంక్షన్స్ లో వినిపిస్తుంటాయి. అలా ఈ యేడాది ఇద్దరు అక్క చెల్లెల్ల ఐటమ్ సాంగ్స్ ఆరంభంలోనూ ఆఖర్లోనూ ఆకట్టుకున్నాయి.
ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన మాస్ మహరాజా రవితేజ సినిమా క్రాక్ నుంచి భూమ్ బద్ధల్ ఐటమ్ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. రామ్ గోపాల్ వర్మ ఇంటర్ డ్యూస్ చేసిన ఈ సోయగం చేసిన ఈ ఐటమ్ సాంగ్ ను పాడింది సింగర్ మంగ్లీ(సత్యవతి). మామూలుగా ఫోక్ సాంగ్స్ తో ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న మంగ్లీ ఇంతకు ముందు కూడా కొన్ని ఐటమ్ సాంగ్స్ పాడినా.. ఈ పాట మాత్రం బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత అన్ని ఫంక్షన్స్ లోనూ మంచి హుషారైన డ్యాన్స్ నంబర్ గా దుమ్మురేపింది.
భూమ్ బద్ధల్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ పాటంటే పుష్ప చిత్రంలోని సమంత నటించిందే. ఊ అంటావా మామా ఊఊ అంటావా మామా అంటూ ఓ విధమైన హస్కీ వాయిస్ తో మెస్మరైజ్ చేసిన ఆ గాత్రం మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహాన్ పాడింది. ఐటమ్ వాయిస్ లలో కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి స్పెషాలిటీ కలిగిన వాయిస్ లా ఉంది ఇంద్రావతి టోన్. ఈ పాటను తను బాగా ఓన్ చేసుకుని పాడినట్టుగా సులువుగా అర్థం అవుతుంది. ఇక ఈ పాట విడుదలైన దగ్గర్నుంచీ ఊపేస్తూనే ఉంది. అలా 2021 స్టార్టింగ్ లో అక్క, చివర్లో చెల్లి పాడిన ఐటమ్ సాంగ్స్ టాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాయన్నమాట.

Related Posts