టాలీవుడ్ లో మరో టైమ్ మెషీన్ కథ

టైమ్ మెషీన్ స్టోరీ.. ఈ మాట వినగానే చాలామందికి ఆదిత్య 369 గుర్తొస్తుంది. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో బాలకృష్ణ డ్యూయొల్ రోల్ చేసిన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాదు.. ఓ క్లాసిక్ గా మిగిలిపోయింది. భూత, భవిష్యత్ కాలాల్లోకి వెల్లిన ఓ టైమ్ మిషన్ కథను కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి జనరంజకంగా చెప్పాడు దర్శకుడు. ఇక భూతకాలంలో శ్రీ కృష్ణదేవరాయలుగా, వర్తమానంలో కృష్ణకుమార్ గా బాలయ్య నటన సూపర్బ్ అనిపించుకుంది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో టైమ్ మెషీన్ నేపథ్యంలో ఏ సినిమా రాలేదు. ఇప్పుడు శర్వానంద్ హీరోగా రూపొందిన ఒకేఒక జీవితం కూడా ఆ నేపథ్యంలో వస్తోన్న చిత్రంగానే కనిపిస్తోంది.
https://www.youtube.com/watch?v=pk0DtSXlaX0
శర్వానంద్ తో పాటు ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్, అమల అక్కినేని, రీతూవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కూడా టైమ్ మెషీన్ ఆధారంగానే తెరకెక్కినిట్టుగా లేటెస్ట్ గా విడుదలైన టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ కాలంలో ఉన్న ముగ్గురు కుర్రాళ్లు తమ బాల్యం నాటి కాలానికి వెళతారు. అక్కడి జ్ఞాపకాలతో మళ్లీ వర్తమానంలోకి వస్తారు. వాటిని తలచుకుంటూ ఉండే సన్నివేశాలతో టీజర్ ఇంట్రెస్టింగ్ గానే కనిపించినా.. ఎదో మిస్ అయిందనే భావన మాత్రం కలుగుతుంది.
ఇక ఇలాంటి తరహాలో ఇంతకు ముందు హాలీవుడ్ లో ద క్రానికల్స్ ఆఫ్ నార్నియా సినిమా వచ్చింది. ఈ మూవీ రెండు మూడు భాగాలుగా కనిపిస్తుంది. స్కూల్ నుంచి కాలేజ్ వరకూ చదుకునే పిల్లలంతా సడెన్ గా భూతకాలానికి వెళతారు. అక్కడ ఓ రాజ్యానికి సింహం రాజుగా ఉంటుంది. ఆ రాజ్యాన్ని ఈ పిల్లలంతా కలిసి కాపాడుతుంటారు. ఒక ఫ్రేమ్ చూస్తే ఈ ఒకేఒక జీవితం కూడా అలాగే కనిపించింది. మరి వీరికి అంత పెద్ద బాధ్యత దర్శకుడు ఇస్తాడు అని ఊహించలేం. ఏదేమైనా ఓ కొత్త కాన్సెప్ట్ లా మాత్రం కనిపిస్తోంది. కానీ బలమైన ఇంపాక్ట్ మాత్రం వేయలేకపోయిందీ టీజర్.

Related Posts