ఏపీలో..ఆర్ఆర్ఆర్ కు ఊర‌ట‌..

ఆర్ఆర్ఆర్.. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. స్టాప్ అనేది లేకుండా నాన్ స్టాప్ గా ఆర్ఆర్ఆర్ టీమ్ ప్ర‌మోష‌న్స్ చేస్తుంది. ఓ వైపు ఓమిక్రాన్ టెన్ష‌న్ పెడుతుంటే.. ఏపీలో గ‌త కొన్ని రోజులుగా థియేట‌ర్ల‌ను సీజ్ చేస్తుండ‌డం మ‌రో టెన్ష‌న్. అయితే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు కాస్త ఊర‌ట ల‌భించింద‌ని చెప్ప‌చ్చు. ఇంత‌కీ మేట‌ర్ ఏంట‌టే.. ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా నిబంధనలు పాటించడం లేదంటూ సీజ్ చేసిన థియేటర్లను తిరిగి ఓపెన్ చేసుకునేందుకు ఏపీ సర్కార్ అవకాశం ఇచ్చింది.

ఇదే విషయం పై ఏపీ మంత్రి మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. నెల రోజులు గడువుతో నిబంధనలు పాటించే అవకాశం ఇచ్చామని చెప్పారు. థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అయితే.. ఏపీ ప్రభుతం సినిమా టికెట్స్ ధరల విషయంలో అమల్లోకి తెచ్చిన జీవో నెంబర్ 35 రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చెయ్యడానికి అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, రెవిన్యూ అధికారులు తనిఖీలకు వెళ్లారు. 83 థియేటర్లకు సీల్ వేశారు.

ఓ వైపు సంక్రాంతి సీజన్ వచ్చేసింది. సంక్రాంతి పండగ సమయంలో చిన్న, పెద్ద సినిమాలు వరసగా రిలీజ్ అవుతూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయి. అసలే కరోనా తో కష్టాల్లో ఉన్న సమయంలో ఇప్పుడు థియేటర్స్ ను సీజ్ చేయడం సబబు కాదని, రేట్ల విషయంలోనూ పునరాలోచించాలని ప్రభుత్వానికి విన్నపాలు అందాయి. దీంతో సీజ్ చేసిన థియేట‌ర్లు ఓపెన్ చేసుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చారు. ఇది ఒక ర‌కంగా ఆర్ఆర్ఆర్ మూవీకి ఊర‌ట అని చెప్ప‌చ్చు.

Related Posts