ఆకట్టుకుంటున్న ‘హాయ్ నాన్న మీట్స్ సైంధవ్‘ ప్రోమో

ఈవారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాల్లో ‘హాయ్ నాన్న‘ ఒకటి. ఈ సినిమాకోసం నాని చేస్తున్న ప్రమోషన్స్ సమ్ థింగ్ స్పెషల్ గా నిలుస్తున్నాయి. ఇటీవలే ‘యానిమల్‘ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి ‘హాయ్ నాన్న‘ స్పెషల్ ఇంటర్యూ చేశాడు నేచురల్ స్టార్. అలాగే నాగార్జునతో ‘బిగ్ బాస్‘లోనూ సందడి చేశాడు. గతంలో నాని కూడా ‘బిగ్ బాస్‘ని హోస్ట్ చేసిన వాడే. ఇక.. లేటెస్ట్ గా ‘సైంధవ్‘ వెంకటేష్ తో కలిసి ‘హాయ్ నాన్న‘ కోసం మరో స్పెషల్ ఇంటర్యూ చేశాడు.

విక్టరీ వెంకటేష్, నేచురల్ స్టార్ నాని కలిసి ముచ్చటించిన స్పెషల్ ఇంటర్యూ ‘వెన్ హాయ్ నాన్న మీట్స్ సైంధవ్‘ ప్రోమో రిలీజయ్యింది. వెంకటేష్ ని నాని అడిగిన ‘క్షణ క్షణం, గణేష్‘ మూవీస్ మెమరీస్.. నాని గురించి వెంకీ పొగిడిన సందర్భాలు వంటివి ఈ ఇంటర్యూలో అలరించబోతున్నట్టు ప్రోమోని బట్టి తెలుస్తోంది. మరి.. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న వెంకటేష్, నాని కలిసి చేసిన ఈ ఇంటర్యూ ఫుల్ వీడియో రేపు రాబోతుంది. ‘హాయ్ నాన్న‘ సినిమా డిసెంబర్ 7న వస్తుంటే.. ‘సైంధవ్‘ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts