మహేష్ బాబు తర్వాత గోపీచంద్

గోపీచంద్.. ఒకప్పుడు వరుస విజయాలతో ఆకట్టున్నాడు. కానీ తర్వాత సక్సెస్ టచ్ ను కోల్పోయాడు. ఒక్క హిట్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన సీటీమార్ ఓకే అనిపించుకుంది కానీ.. యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోలేకపోయింది. బట్ అంతకు ముందు వచ్చిన వరుస డిజాస్టర్స్ తో చూసుకుంటే చాలా వరకూ బెటర్ అనిపించుకుంది. అంటే ఓ సాలిడ్ హిట్ కోసం గోపీచంద్ నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట. ఆ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే.. ఇప్పుడు చిన్న చిన్న పాయింట్స్ తో మాగ్జిమం ఆకట్టుకునే సినిమాలు చేస్తోన్న మారుతి డైరెక్షన్ లో ఇప్పుడు పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు.
మారుతి ఇప్పటి వరకూ గోపీచంద్ లాంటి మాస్ హీరోను డైరెక్ట్ చేయలేదు. పైగా అతని కథలు గోపీ ఇమేజ్ కు సరిపోతాయి అని కూడా అనుకోలేం. అయితే ఇటు గోపీచంద్ కూడా రెగ్యులర్ మాస్ మూవీ కంటే ఓ కంప్లీట్ కమర్షియల్ సినిమాకే ఓటు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అలాగని ఇంతకు ముందు చేసిన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు అని కాదు. కానీ ఆ ఎలిమెంట్స్ ను సరిగ్గా కలిపే కథ కూడా ఇంపార్టెంట్ కదా.. కొన్నిసార్లు కథాలోపం అయితే.. మరికొన్నిసార్లు కథన లోపంతో బాక్సాఫీస్ బరిలో ఓడిపోతున్నాడు గోపీచంద్.
ఇక పక్కా కమర్షియల్ నుంచి లేటెస్ట్ గా టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. మరీ గొప్పగా ఏం లేదు కానీ.. ఈ పాటతో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. కరోనా కరుణిస్తే.. అంటూ మే 20న విడుదల కాబోతోందని అనౌన్స్ చేశారు. అంటే మే 12న మహేష్ బాబు సర్కారువారి పాట ఉంది. ఆ తర్వాత వారం పక్కా కమర్షియల్ అంటూ గోపీచంద్ వస్తాడన్నమాట. నిజానికి మే నెలలో పెద్దగా పోటీ ఉండదు అనుకున్నారు. అంటే ఈ రెండు సినిమాలకూ మంచి డేట్స్ దొరికినట్టే అనుకోవచ్చు. మరి ఈ చాన్స్ అయినా గోపీచంద్ వాడుకుంటాడా లేక పరంపర కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి.

Related Posts