డిజే టిల్లు ట్రైలర్ – చీటింగ్ జేస్తే ఎట్లుండాల..?

డిజే టిల్లు.. కొన్నాళ్లుగా యూత్ లో మంచి హాట్ టాపిక్ గా నిలుస్తోన్న సినిమా. టైటిల్ నుంచి మొదలై పోస్టర్స్, టీజర్, సాంగ్స్ వరకూ సరికొత్తగా ఉన్నాయనిపించుకుంటోన్న సినిమా. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ సైతం వెరీ ఇంప్రెసివ్ అనిపించుకుంటోంది. అట్లుంటది మనతోని అనే క్యాప్షన్ తో వస్తోన్న ఈ చిత్రం కూడా అట్లనే ఉండేలా కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తే కంప్లీట్ యూత్ ఫుల్ కంటెంట్ లా కనిపిస్తోంది. ముఖ్యంగా అర్బన్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకున్న చిత్రంలా కనిపిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ మూవీ కంటెంట్ కూడా రెగ్యులర్ గా కాకుండా కాస్త కొత్త కథ, కథనంతో వస్తున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది.
పబ్ లో డిజే నడుపుకునే ఓ కుర్రాడు.. అక్కడికి వచ్చిన అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేస్తూ ఉంటాడు. అలా వచ్చిన హీరోయిన్ తో ఏకంగా తనకు అల్లు అర్జున్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చిందని చెప్పి ఆమెను పడేస్తాడు. కట్ చేస్తే తను మరో ఇద్దరితోనూ తిరుగుతుందనే అనుమానం కలుగుతుంది టిల్లుకి. ఆ విషయం తను కన్ఫార్మ్ చేసుకుని ఆ అమ్మాయితో కూడా అలాగే ప్రవర్తిస్తుంటాడు. అటు హీరోయిన్ కూడా ప్రిన్స్ తో రొమాంటిక్ సీన్ చేసినట్టుగా ఉంది. ఇవన్నీ టిల్లుకు తెలిసి తన దిల్లుకు చిల్లు పడిందని ఫ్రెండ్స్ దగ్గర వాపోతుంటాడు. ‘తనకో ల్యాండ్ ఉందనుకున్నాడనీ.. కానీ అది ఊర్లో అందరి పేరుతో రిజిస్టర్ అయిందని’ చెప్పే డైలాగ్స్ తో పాటు అలాంటివే ఎక్కువగా ఉన్న మాటలు కూడా యూత్ ను ఊపేసేలా ఉన్నాయనుకోవచ్చు.
ఇక ట్రైలర్ చివర్లో చెప్పిన డైలాగ్ హిలేరియస్ గా ఉంది. హీరోయిన్ తనను మోసం చేసిందనే విషయాన్ని ఆమెకే చెబుతూ.. ‘మోసం చేస్తే ఎట్లుండాలే.. బనియన్ కు తెలియకుండా డ్రాయర్ లాగేయాలి’డైలాగ్ బలే ఉంది. ఓ రకంగా హీరో ఈ సినిమాలో పాపం తను ప్రేమించిన అమ్మాయికి మరికొందరితోనూ సంబంధం ఉందని తెలిసి తెగ ఫీలయ్యే పాత్రలా ఉంది.
ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం చేశాడు. సిద్ధు రచనలో తన సహకారం కూడా అందించాడు. అన్నీ కుదిరితే ఈ నెల 11న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మొత్తంగా యూత్ కు విపరీతంగా నచ్చే సినిమాలానే కనిపిస్తోందీ ట్రైలర్ చూస్తోంటే..

Related Posts