జీ తెలుగులో ఫన్ టాస్టిక్ సండే షో లు

హైదరాబాద్, 14th సెప్టెంబర్, 2022: వినోదాత్మకమైన ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోస్ తో నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను పంచుతున్న ‘జీ తెలుగు’ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకువస్తూ వారి మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ముగిసిన ‘జీ సూపర్ ఫామిలీ’ షోకి దీటుగా ఇప్పుడు ‘లేడీస్ & జెంటిల్మెన్’ అనే మరో ఎంటర్టైనింగ్ షోని సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనుంది. ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి ప్రతివారం ముగ్గురు సరికొత్త సెలబ్రిటీ కపుల్స్ లేదా ఫ్రెండ్షిప్ జోడీలు తరలివచ్చి వీక్షకులను అలరించనున్నారు. అంతేకాదు, ఈ ఆదివారం రెట్టింపు వినోదాన్ని పంచడానికి మరో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ని — ‘F3: ఫన్ & ఫ్రస్ట్రేషన్’ — సాయంత్రం 6 గంటలకు ప్రజల ముందుకు తీసుకురానుంది ‘జీ తెలుగు’.

‘లేడీస్ & జెంటిల్మెన్’ మొదటి ఎపిసోడ్లో భాగంగా సెలబ్రిటీ కపుల్స్ అలీ-జుబేదా, మనో-జాలీమా, మరియు బాబా భాస్కర్-రేవతి మూడు ఫన్నీ రౌండ్లలో తలపడి సందడి చేయనున్నారు. అదేవిధంగా, ఈ సెలబ్రిటీ కపుల్స్ ప్రదీప్ ని పెళ్లి విషయంలో ఏడిపించిన విధానం మరియు అతనికి వారు ఇచ్చిన టిప్స్ అందరిని నవ్వించనున్నాయి.’లేడీస్ & జెంటిల్మెన్’ తో 90 నిమిషాల ప్యూర్ ఎంటర్టైన్మెంట్ తరవాత ఈ డోస్ ని మరి కాస్త పెంచుతూ సాయంత్రం 6 గంటలకు ‘F3: ఫన్ & ఫ్రస్ట్రేషన్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ (వెంకీ), వరుణ్ తేజ్ (వరుణ్), తమన్నా భాటియా (హారిక), మరియు మెహ్రీన్ పిర్జాదా (హనీ) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ కుటుంబ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

కథ విషయానికొస్తే, వెంకీ, వరుణ్, హారిక-హనీ & ఫ్యామిలీ ఒక వ్యాపారవేత్తను మోసం చేసి రాత్రికిరాత్రి కోటీశ్వరులు అవ్వాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారు. మరి ఆ ప్రయత్నంలో ఎవరు విజయం సాధిస్తారు, ఈ ప్రయాణంలో వారు ఏం తెలుసుకుంటారో తెలియాలంటే ఈ ఆదివారం నాడు ‘F3’ సినిమాను జీ తెలుగులో వీక్షించండి.సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు ‘లేడీస్ & జెంటిల్మెన్’ మరియు సాయంత్రం 6 గంటలకు ‘F3’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ని తప్పక వీక్షించండి, మీ జీ తెలుగులో

Related Posts