ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ‘రజాకార్‘

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శిష్యుడు యాటా సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రజాకార్‘. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్రజ, మ‌క‌రంద్ దేశ్ పాండే, అనసూయ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో మంచి అంచనాలను ఏర్పరచుకున్న ‘రజాకార్‘ నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. ట్రైలర్ చూస్తుంటే.. రాజమౌళి తరహా మేకింగ్ గుర్తుకొస్తోంది. నిజాం నిరంకుశ పాలనను కళ్లకు కట్టినట్టు చూపించేలా.. ఆ కాలాన్ని ప్రతిబింబిస్తూ సాగే ‘రజాకార్‘ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మార్చి 1న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో విడుదలకాబోతుంది.

Related Posts